వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధాలు, డబ్బు తీసుకెళ్తూ హోంమంత్రి అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Nagaland home minister detained for carrying arms, cash
కోహిమా: ఆయుధాలు, భారీగా డబ్బును తన కారులో తీసుకు వెళ్తూ స్వయంగా హోంమంత్రి పోలీసులకు పట్టుబడిన సంఘటన నాగాలాండులో చోటు చేసుకుంది. సోమవారం నాగాలాండు హోంమంత్రి ఇమ్‌కాంగ్ ఎల్ ఇంచెన్ తన కారులో ఆయుధాలు, కోటీ పది లక్షల రూపాయలు తీసుకు వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయన వోఖా జిల్లా సరిహద్దుల్లో నగదు, ఆయుధాలతో దొరికిపోయారు.

ఇమ్‌కాంగ్ ఎల్ ఇంచెన్ కోహిమా నుండి మోకోచుంగ్ జిల్లాలోని తన నియోజకవర్గం అయిన కోడిడంగకు వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సూచనల మేరకు అసాం రైఫిల్స్ రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం వోఖా జిల్లా సరిహద్దుల్లో రైఫిల్స్ నగదు, మందు, ఆయుధాలు తదితర వాటి కోసం సోదాలు నిర్వహిస్తుండగా హోంమంత్రి కారులో ఆయుధాలు, డబ్బు దొరికింది.

ఇమ్‌కాంగ్ ఎల్ ఇంచెన్ అధికార నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీకి చెందిన నేత. అతను కొరిడంగ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు. పార్టీ మోకోచుంగ్ జిల్లా ఇంఛార్జి కూడా ఇతనే. నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ ఈ జిల్లాలో పదిమంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఫిబ్రవరి 16వ తేదిన ఎన్నికల కమిషన్ ఇదే పార్టీకి చెందినదిగా భావిస్తున్న హెలికాప్టర్ నుండి కోటి రూపాయలను స్వాధీనం చేసుకుంది.

ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరుగకుండా ఉండేందుకు ఈసి ఆదేశాలు జారీ చేసింది. కాగా, నగదు, ఆయుధాలతో పట్టుబడ్డ హోంమంత్రి ఇమ్‌కాంగ్ ఎల్ ఇంచెన్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

English summary
Nagaland Home Minister Imkong L Imchen was detained on Monday near Wokha district for allegedly carrying a cache of arms and ammunition and Rs 1.10 crore in cash in a vehicle, official sources said. Imchen was going to his constituency Koridanga in Mokokchung district from Kohima when Assam Rifles personnel conducting search of vehicles near Wokha district found the arms and ammunition, liquor and cash, the sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X