హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యుత్ సమస్యను అధిగమిస్తాం: భక్షి, తలసాని దీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Power
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమిస్తామని సెంట్రల్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ భక్షి అన్నారు. విద్యుదుత్పత్తి పడిపోవడానికి అనేక కారణాలున్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. వర్షాలు లేకపోవడం, గ్యాస్ అనుకున్నంత లభ్యం కాకపోవడం వంటి కారణాలతో విద్యుదుత్పత్తి పడిపోయిందని ఆయన అన్నారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం పుర్తయితే కొరత తగ్గుతుందని ఆయన అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తు తీసుకుంటామని, ఉత్తరాది నుంచి విద్యుత్తును తరలించడానికి సదుపాయాలు లేవని ఆయన అన్నారు. కూడంకళం నుంచి రాష్ట్రానికి 150 మెగావాట్ల విద్యుత్తును అందిస్తామని ఆయన చెప్పారు.

విద్యుత్ సమస్యను అధిగమించడంలో ప్రణాళికా లోపం లేదని ఇంధనం శాఖ ఉన్నతాధికారి సాహు చెప్పారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల, వర్షాలు లేక విద్యుదుత్పత్తి తగ్గి కొరత ఏర్పడిందని, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా విద్యుత్ సమస్య ఉందని ఆయన చెప్పారు.

తలసాని మౌనదీక్ష

తమ పార్టీ శానససభ్యుల దీక్షను అర్థరాత్రి భగ్నం చేయాడన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నగర నాయకుడు శ్రీనివాస యాదవ్ నాయకత్వంలో ఇందిరా పార్కు వద్ద కార్యకర్తలు మౌనదీక్షకు దిగారు. నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన చేపట్టారు.

ఇదిలావుంటే, నిమ్స్‌లో దీక్షలు విరమించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఈఆర్సీ చైర్మన్ రఘోత్తమ రావును కలిశారు. విద్యుత్తు చార్జీలు పెంచకూడదని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. విద్యుత్తు చార్జీలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు వెలువడకుండా మాట్లాడానని రఘోత్తమ రావు చెప్పారు. బహిరంగ విచారణలో లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. చార్జీలను పెంచబోమని హామీ ఇస్తేనే కదులుతామని తెలుగుదేశం నేతలు ఛాంబర్‌లో బైఠాయించారు.

ఈఆర్సీకి వెన్నుముక లేదని, ఈఆర్సీసీ ప్రభుత్వ జేబు సంస్థగా పనిచేస్తోందని టీడీపీ నేత గాలిముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ప్రజావ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం వచ్చినా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని గాలి హెచ్చరించారు.

English summary
Central Energy Commission chairman Bakshi said that power problem will be solved soon. Meanwhile, Telugudesam leader Talasani Srinivas Yadav staged dharna on power crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X