బాబుకు చేయి, తెరాసలోకి దేవయ్య: కవిత కూడా

suddala devaiah and kalwakuntla kavitha
నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణలో మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. టిడిపి శానససభ్యుడు సుద్దాల దేవయ్య మే 3వ తేదీన రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమాలకర్‌తో పాటే సుద్దాల దేవయ్య తెరాసలో చేరుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆయన వెనక్కి తగ్గారు.

కాగా, తాను తెరాసలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను సుద్దాల దేవయ్య ఖండించారు. ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన తనకు లేదని ఆయన అన్నారు. ఇప్పట్లో తెరాసలోకి వెళ్లే ఆలోచన లేదని ఆయన అన్నారు. పార్టీ మారాలని అనుకుంటే చెప్పే మారుతానని ఆయన అన్నారు.

కాగా, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఆమె శనివారం పార్టీ వార్షికోత్సవ సభలో తెరాసలో చేరుతారని అంటున్నారు. ఇప్పటి వరకు ఆమె పార్టీకి దూరంగానే ఉన్నారు. కల్వకుంట్ల కవిత వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో శనివారం తెరాస వార్షికోత్సవ సభ జరుగుతోంది. ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా కెసిఆర్ కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఈ సభలో అందుకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేయవచ్చునని భావిస్తున్నారు. ఈ ప్రతినిధుల సభలోనే బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చేపట్టే ఉద్యమ కార్యాచరణను రూపొందించవచ్చునని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+