వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనే పాపం చేయలేదు: శ్రీశాంత్, మరాఠీ నటి కొరియరా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sreesanth
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ అభియోగాలపై అరెస్టై పోలీసు కస్టడీలో ఉన్న కేరళ పేసర్ శ్రీశాంత్.. తాను అమాయకుడినని, ఎలాంటి పాపం చేయలేదని చెబుతున్నాడు. ఆయన తన లాయర్ రెబెకా జాన్ ద్వారా మీడియాకు సందేశం పంపించాడు. తాను అమాయకుడినని, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. తాను ఎలాంటి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని వివరణ ఇచ్చుకున్నాడు.

ఓ క్రికెటర్‌గా తాను ప్రశంసలతో పాటు ఎదురు దెబ్బలు కూడా ఫేస్ చేయడం నేర్చుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఇది తనకు కఠినమైన సమయమన్నాడు. భారత న్యాయస్థానాల పైన తనకు నమ్మకముందని, తాను పరిశుద్దుడిగా బయటకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాను మళ్లీ క్రికెట్లో పూర్వ వైభవం దక్కించుకుంటాననే విశ్వాసం కూడా వ్యక్తం చేశాడు. తాను ఇదివరకటి స్థాయికి చేరుకుంటానన్నాడు.

దేవుడా.. రక్షించు: శ్రీశాంత్ మొదటి పేజీలో..

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకొని అరెస్టైన శ్రీశాంత్ డైరీ తొలి పేజీలో ఓ దేవుడా నన్ను రక్షించు అనే వాక్యం కనిపించిందట. ఒక్క పేజీలోనే కాదు.. లోపలి పేజీలలోను అక్కడక్కడా ఇవే వాక్యలు రాసుకున్నాడట. దీనిని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అతను ఫిక్సింగ్ ఉచ్చులో చిక్కుకున్నాడా.. చిక్కుకున్నాక బయటపడలేని పరిస్థితికి చేరుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో శ్రీశాంత్ కొందరు అమ్మాయిల పేర్లు, ఫోన్ నంబర్లు కూడా రాసుకున్నాడట. డైరీలో శ్రీశాంత్ కొన్ని పేజీలు మాత్రమే రాశాడు. కొన్ని వాక్యలు మలయాళంలో ఉన్నాయి. స్పాట్ ఫిక్సింగ్ సమయంలో శ్రీశాంత్‌తో పాటు ఉన్న మరాఠీ నటి.. క్రికెటర్లకు బుకీలకు మధ్య కొరియర్‌గా ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
"I am innocent and have done no wrong," Sreesanth said in a statement emailed by his lawyer, Rebecca John. "I have never indulged in any spot-fixing."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X