వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యెరవాడ జైలులో ఖైదీ దుస్తుల్లో సంజయ్ దత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sanjay Dutt
ముంబై: పూణేలోని యెరవాడ జైలులో ఖైదీ దుస్తులను సంజయ్ దత్ ధరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయనకు ఖైదీ నెంబర్ కూడా కేటాయిస్తారు. దానిపై సి అనే అక్షరం ఉంటుంది. సి దోషి అనే అర్థాన్నిస్తుంది. సంజయ్ దత్‌ను ముంబై ఆర్థర్ రోడ్డు జైలు నుంచి గత రాత్రి పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన సంజయ్ దత్ వారం రోజుల క్రితం లొంగిపోయాడు.

పూణేలోని యెరవాడ జైలులో సంజయ్ దత్ గతంలో రెండు సార్లు ఉన్నాడు. అయితే, గతంలో అతను విచారణ ఖైదీగా ఈ జైలులో గడిపాడు. ఈ దోషిగా జైలు జీవితం గడపాల్సి ఉంది. సంజయ్ దత్‌ను అండా సెల్‌లో ఉంచే అవకాశం ఉంది. అది అండాకారంలో ఉంటుంది. ఈ సెల్ సగభాగం పునాదిలోకి వెళ్తుంది. దీనికి భద్రత ఎక్కువగా ఉంటుందని అంటారు.

ఇంటి నుంచి తెచ్చే భోజనానికి, చాపకు, దిండుకు, మందులకు కోర్టు సంజయ్ దత్‌కు అనుమతి ఇచ్చింది. జైలులో ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగడానికి మాత్రం కోర్టు అనుమతి నిరాకరించింది. గతంలో యెరవాడ జైలులో సంజయ్ దత్ వడ్రంగి పని చేశాడు. ఈసారి అతను శ్రమశక్తి చేస్తాడని భావిస్తున్నాీరు. జైలు క్యాంటిన్ నుంచి అవసరమైనవాటిని కొనుక్కోవడానికి ఇంటి నుంచి 1500 రూపాయలు పొందడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. నెలకు ఓసారి 20 నిమిషాల పాటు సందర్శకులను అనుమతిస్తారు.

ఈ నెల 16వ తేదీన సంజయ్ దత్ టాడా కోర్టులో లొంగిపోయారు. అక్కడి నుంచి ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. సంజయ్ దత్ 42 నెలల పాటు జైలు జీవితం గడపాల్సి ఉంది.

English summary
Almost a week after he surrendered, actor Sanjay Dutt was quietly shifted out of Mumbai's Arthur Road Jail and sent to Pune's Yerwada prison late last night. He will spend the next 42 months here to complete his jail term.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X