మా ఆయన బంగారం, వేధిస్తున్నారు: విందూ భార్య

విశాలమైన, బంగారంలాటి మనసు గల అత్యంత గొప్ప వ్యక్తి విందూ అని, అతని వంటి వ్యక్తిని తాను జీవితంలో చూడలేదని, మీడియానే దాన్ని పెద్దగా చేస్తోందని ఆమె అన్నారు. విందూది బెయిల్ లభించే నేరమని, అయితే రాజకీయ కారణాలతో విందూను వేధిస్తున్నారని ఆమె అన్నారు.
విందూను పోలీసులు మే 21వ తేదీన అరెస్టు చేశారు. ఐపియల్ మ్యాచుల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు ఒడిగట్టిన బుకీలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పోలీసులు విందూను అరెస్టు చేశారు. ఆయనపై చీటింగ్, ఫోర్జరీ సెక్షన్ల కేసులు నమోదు చేశారు. బుకీ అయిన మిత్రుడు ఆనంద్ ద్వారా తాను బెట్టింగులోకి వచ్చినట్లు విందూ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. చాలా కాలం నుంచి ఆనంద్ తనకు తెలుసునని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
దుబాయ్‌కి పారిపోవడానికి బుకీలు సంజయ్ జైపూర్, పవన్ జైపూర్‌లకు సాయం చేసినట్లు కూడా విందూ పోలీసులకు చెప్పాడు. బిసిసిఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ తరఫున తాను బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు కూడా అతను చెప్పాడు. గురునాథ్ మేయప్పన్‌ను పోలీసులు ఈ నెల 24వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగులు కట్టిన కొంత మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లను కూడా విందూ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
రోహిత్, శార్దూల్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు: చిన్ననాటి కోచ్ వీడియో -
Yuvraj Singh:మృత్యువును జయించిన యోధుడు-యువీ ఎమోషనల్ స్టోరీ..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల












Click it and Unblock the Notifications