నటి జియా ఖాన్ ఆత్మహత్య: సూరజ్ లింక్స్‌పై విచారణ

విచారణ నిమిత్తం పోలీసులు సూరజ్‌ను పిలిచి అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జియా, సూరజ్ మంచి మిత్రులు. ఇరువురు కలిసి పార్టీలకు వెళ్తుండేవారు. జియాతో సూరజ్ తెగదెంపులు తీసుకున్నాడని, దీంతో జియా ఖాన్ మనస్తాపానికి గురైందని అంటున్నారు. తిరిగి సినిమాల్లో నటించాలనే జియా ప్రయత్నం కూడా అంతగా పలించలేదని అంటున్నారు.
ఆడిషన్ తర్వాత హైదరాబాదు నుంచి తిరిగి వచ్చిన జియా ఖాన్ ఉరేసుకుని మరణించింది. సూరజ్ నటుడిగా ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ అతనికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
నఫీషా ఖాన్‌గా ప్రసిద్ధి పొందిన జియా ఖాన్ 2007లో అమితాబ్ సరసన వివాదాస్పద సినిమా నిశబ్ద్ తర్వాత చిత్రరంగ ప్రవేశం చేసింది. గజనీలో అమీర్ ఖాన్ సరసన, హౌస్‌ఫుల్‌లో అక్షయ్ కుమార్ పక్కన జియా ఖాన్ నటించింది.












Click it and Unblock the Notifications