హైదరాబాద్ ఆడిషన్: జియా ఆత్మహత్యపై తల్లి(పిక్చర్స్)
ముంబై: బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్యపై ఆమె తల్లి రబియా అమిన్ మంగళవారం స్పందించారు. ఆదివారం నాడు హైదరాబాదులో జరిగిన ఆడిషన్ తర్వాత జియాఖాన్ నిరాశ చెందిందని తల్లి రబియా చెబుతున్నారు. ఆమె పోలీసులతో చెప్పిన వివరాల ప్రకారం... జియా ఖాన్ హైదరాబాదుకు ఆడిషన్ కోసం వెళ్లిందని, అప్పటి నుండి డిసప్పాయింట్‌తో ఉందని చెప్పారు. ఆడిషన్‌లో తన ప్రదర్శన పట్ల జియా సంతృప్తి చెందలేదట.
బాలీవుడ్ నటి జియాఖాన్ సోమవారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. నిశ్శబ్ద్, హౌస్‌ఫుల్ చిత్రాలతో పాటు అమీర్‌ఖాన్ సరసన గజని చిత్రంలోనూ నటించారు. జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన జుహులోని ఆమె నివాసానికి చేరుకున్నారు.
అనంతరం కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. లండన్‌లో పుట్టి పెరిగిన జియా ఇటీవలే తల్లి రబియాతో కలిసి ముంబై షిప్ట్ అయ్యారు. ఆమె తన పర్శనల్ కారణాలతో చాలా డిప్రెషన్ లో ఉంది, కానీ త్వరలో నటనపై పూర్తి దృష్టి పెడదామనుకుంది.
నిశ్సబ్ద్ చిత్రం ద్వారా పాపులర్ అయిన జియా అర్థాంతరంగా తనువు చాలించింది. వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించారు. అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె అసలు పేరు నఫీసా ఖాన్. తల్లి రబియా అమిన్. తల్లి కూడా 1980లలో సినిమాలలో నటించారు.
జియా ఖాన్ లండన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సు చేశారు. సినిమాలంటే చిన్నప్పటి నుంచి అభిమానం. జియా 1988 ఫిబ్రవరి 20న జన్మించారు. వెండితెరకు 18 ఏళ్లకే వెండితెరకు పరిచయమైన ఆమె బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు.

ముంబైలోని సాగర్ సంగీత్ అపార్టుమెంటులోని తన ఇంటిలో జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్నారు.

బాలీవుడ్ కెరీర్ ఆశాజనకంగా లేదని జియాఖాన్ ఆవేదన చెందిందని ఆమె తల్లి చెప్పారు.

తల్లి, సోదరి ఇంటిలో లేని సమయంలో జియా ఖాన్ ఆత్మహత్య చేసుకున్నారు.

జియాఖాన్ మృతిని దియా మీర్జా సామాజిక వెబ్ సైట్ ద్వారా మొదట బయట పెట్టారు. జియా ఖాన్ బాలీవుడ్‌లో యంగెస్ట్ అండ్ టాలెంటెడ్ నటి.

2007లో విడుదలైన నిశ్సబ్ద్ చిత్రంలో జియాఖాన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించారు. ఈ చిత్ర దర్శకులు రామ్ గోపాల్ వర్మ.












Click it and Unblock the Notifications