వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమ వ్యవహారం: కూతురిని ఐదేళ్లు నిర్బంధించిన తండ్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

woman
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని మల్లేశ్వరంలో దారుణం జరిగింది. ఓ యువతిని తల్లిదండ్రులు ఐదేళ్లుగా నిర్బంధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హేమవతి అనే ముప్పయ్యేళ్ల యువతి మల్లేశ్వరంలో తల్లిదండ్రులతో పాటు ఉంటోంది. ఐదారేళ్ల క్రితం ఆమె ట్యూషన్స్ చెప్పేది. అయితే హఠాత్తుగా ఆ తర్వాత కనిపించలేదు.

ఆమె ఓ వ్యక్తిని ప్రేమించడం వల్ల కన్న తండ్రి ఆమెను ఐదేళ్లుగా గృహ నిర్బంధంలో ఉంచినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూతురు ప్రేమ ఇష్టం లేకపోవడం వల్లనే తండ్రి ఆమెను నిర్బంధించారంటున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెను ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

ఆమె మతిస్థిమితం కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఐదేళ్లుగా ఆమెను తండ్రి ఒకే గదిలో ఉంచి, ఓ పళ్లెంలో భోజనం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తమ కూతురుకు మతిస్థిమితం లేకపోవడం వల్లనే గదిలో ఉంచామని తండ్రి చెబుతున్నారు.

మంగళవారం పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఏ విషయాలు చెప్పలేని స్థితిలో ఉంది. ఆమె ఆరోగ్యం బాగుపడ్డాక పోలీసులు ఆమె నుండి వివరాలు తెలుసుకోనున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు హేమవతి చదువులోను, యాక్టివిటీస్‌లోను చురుగ్గా ఉండేదని చెబుతున్నారు. ఆ తర్వాత హఠాత్తుగా మాయమైందని స్థానికులు చెబుతున్నారు. హేమవతికి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సంబంధిత మంత్రి చెప్పారు.

English summary
A woman was allegedly kept under house arrest for several years by her parents in Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X