వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొగుడుతూ చిన్నారి కవిత.. కిరణ్ కుమార్ రెడ్డి వరం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఓ చిన్నారి కిరణ్ కుమార్ రెడ్డి పథకాలను పొగుడుతూ ఓ కవితను చెప్పింది. దానికి కిరణ్ ముగ్ధుడయ్యారు. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకొని, బాలికకు మోడల్ స్కూల్‌లో ప్రవేశం కల్పించాలని అదే వేదిక పైన ఉన్న కలెక్టర్‌ను ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి విశాఖపట్నంలోని అనకాపల్లిలో తొలి మోడల్ స్కూల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా హేమమాలిని అనే చిన్నారి కిరణ్ హయాంలోని పథకాలను పొగుడుతూ ఓ కవితను చెప్పారు. కిరణ్ పాలన బాగుందని, న్యాయమైన పాలన అందిస్తున్నారని, పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ పథకాలు అందిస్తూ, సంక్షేమ పాలన అందిస్తున్నారని ఆమె తన కవితలో చెప్పారు.

Girl praises Kiran Kumar Reddy

హేమమాలిని కవితకు ముఖ్యమంత్రి కిరణ్ మంత్రముగ్ధుడయ్యారు. చిన్నారి కవిత చదువుతున్నంత సేపు ముఖ్యమంత్రితో పాటు అక్కడున్న వారు చిరునవ్వులు చిందించారు. దానిని ఆస్వాదించారు. కవిత పూర్తైన అనంతరం ఆ చిన్నారిని ముఖ్యమంత్రి దగ్గరకు పిలిపించుకొని భుజం తట్టారు. అనంతరం ఆమెకు మోడల్ స్కూల్లో అవకాశం కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

హేమమాలిని తుమ్మపాల గ్రామానికి చెందిన విద్యార్థిని. ఈమె ఎనిమిదో తరగతి చదువుతోంది. కిరణ్‌తో పాటు అక్కడున్న ఇతరులు ఆమెను అభినందించారు.

English summary
CM Kiran Kumar Reddy interacts with a school student Hema Malini at Thegada in Kasimkota mandal of Visakhapatnam district on Monday in the presence of minister for ports Ganta Srinivas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X