వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిక్చర్స్: మళ్లీ తెహ్రీర్ స్క్వేర్‌లో ఈజిప్టు, తర్వాత?

By Pratap
|
Google Oneindia TeluguNews

కైరో: అది 2011 ఫిబ్రవరి. పది లక్షల మందికి పైగా ప్రజలు ఈజిప్టులోని తెహ్రీర్ స్క్యేర్‌కు చేరుకున్నారు. దశాబ్దాలుగా తమపై విధించిన నిషేధాలను బద్దలు కొట్టారు. ఏవి చేయకూడదని ఆంక్షలు పెట్టారో వాటిని చేశారు. తమకు ఏది నచ్చితే అది చేశారు. తమను తాము వ్యక్తీకరించుకున్నారు. హోస్నీ ముబారక్‌ను గద్దె దింపడం వారి అంతిమ లక్ష్యం.

18 రోజులు భారీ నిరసన ప్రదర్శనతో ముప్పయి ఏళ్ల ముబారక్ పాలన ముగిసింది. ముబారక్ రాజీనామా చేశారని, అధికారాలను సైనిక బలగాల అత్యున్నత మండలికి అప్పగించారని ఉపాధ్యక్షుడు ఒమర్ సులేమాన్ ప్రకటించారు. దాంతో బాణాసంచాలు పేలాయి. ఈజిప్టు పతాకలు ఆకాశాన్ని ముద్దాడాయి. తెహ్రీర్ స్క్రేర్ విజయోత్సవంలో మునిగిపోయింది.

తెహ్రీర్ స్క్రేర్ మరోసారి ఈ ఏడాది జులైలో తెర మీదికి వచ్చింది. ఈసారి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన దేశాధ్యక్షుడు మోహమద్ మోర్సీని గద్దె దింపే విషయంలో తెర మీదికి వచ్చింది. ఆర్మీ ఒత్తిడికి తలొగ్గి ఆయన గద్దె దిగాల్సి వచ్చింది.

రెపరెపలాడిన జాతీయ పతాక

ఈజిప్టు అధ్యక్షుడు మొహమద్ మోర్సీని వ్యతిరేకించేవారు తెహ్రీర్ స్క్రేర్‌కు పెద్ద యెత్తున చేరి జాతీయ పతాకలను ఎగురవేస్తూ బాణసంచా పేలుస్తూ వెలుగులు నింపారు.

మెర్సీ వ్యతిరేకి ఇలా..

కైరోలోని అధ్యక్ష భవనం వద్ద మోర్సీ వ్యతిరేకి ఒకరు బాణసంచా పేలుస్తూ ఇలా..

మోర్సీ వ్యతిరేకులు ఇలా..

ఈజిప్టు ఇస్లామిక్ అధ్యక్షుడు మొహమద్ మోర్సీ వ్యతిరేకులు తెహ్రీర్ స్క్రేర్ వద్ద జులై 3వ తేదీన నినాదాలు చేశారు. సైన్యం పెట్టిన 48 గంటల గడువు ముగిసిందని, అధ్యక్ష పీఠాన్ని వదిలేయాలని వారు డీమాండ్ చేశారు.

మోర్సీ అధ్యక్ష ఎన్నికల్లో 52 శాతం ఓట్లు సాధించి నిరుడు జూన్ 30వ తేదీన అధ్యక్ష పదవిని చేపట్టారు. అధికారాన్ని సైన్యం నుంచి తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈజిప్టులో తొలి ప్రజాస్వామ్య ప్రయోగం విఫలమైంది. దేశం మళ్లీ తెహ్రీర్ స్క్యేర్‌లో నిలబడింది. ఇప్పుడేమిటనేది ప్రశ్న

English summary
February 2011. More than a million people had gathered at Tahrir Square in Egypt. They were all doing what they have not been able to do for decades. Each one was expressing himself in his own way and insisting on being counted. Their ultimate demand was to bring down dictator Mubarak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X