బోఫోర్స్ స్కాం నిందితుడు ఖత్రోకీ గుండెపోటుతో మృతి

Bofors scam accused Quattrocchi’s death sparks war of words
రోమ్: బోఫోర్స్ కుంభకోణం కేసులో కీలక పాత్రధారి అయిన ఇటలీ వ్యాపారి ఒట్టోవియో ఖత్రోకీ మృతి చెందాడు. ఖత్రోకీ గుండెపోటుతో మిలాన్‌లో మృతి చెందాడు. బోఫోర్స్ కేసుతో ప్రముఖంగా అతను తెర పైకి వచ్చాడు. ఇతడు ఇటాలియన్ ఆయుధ దళారి. ఆయన వయస్సు 74 ఏళ్లు. ఖత్రోకీ మృతిని ఆయన భార్య మారియా ద్రువీకరించారు. గుండెపోటుతో ఆయన మరణించినట్టు ఆమె వార్తాసంస్థలకు ప్రకటన విడుదల చేశారు.

మూడు దశాబ్దాల క్రితం మన దేశ రాజకీయాలను బోఫోర్స్ శతఘ్నుల కొనుగోళ్ల వ్యవహారం ఓ కుదుపు కుదిపింది. అప్పుడు ఖత్రోకీ పేరు బాగా వినిపించింది. 1993 వరకు భారత్‌లోనే ఉన్న ఖత్రోకీ తనపై అరెస్టు వారంట్ నమోదు కావడంతో దేశం వదిలి పారిపోయారు. ఇంటర్ పోల్ సంస్థ ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ సైతం జారీ చేసింది. ఆయన ఏ ఒక్కనాడూ భారత్‌కు రావడం గానీ, కోర్టు విచారణను ఎదుర్కోవడం గానీ చేయలేదు.

ఈ క్రమంలో సిబిఐ 1999లో ఆయనపై ప్రధాన అభియోగ పత్రం నమోదు చేసింది. ఆయనను మనదేశానికి తీసుకురావడానికి సిబిఐ అధికారులు రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. 2003లో మలేషియాలో, 2007లో అర్జెంటీనాలో దొరికినట్టే దొరికి తప్పించుకుపోయారు. రెండు దశాబ్దాలకు పైగా దర్యాప్తు చేసినా ఖత్రోకీకి వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ దొరకలేదంటూ 2009లో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు 2011 మే 4వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఖత్రోకీపై అభియోగాలను రద్దు చేసింది.

దీంతో ఒక్కరికి కూడా శిక్ష పడకుండానే బోఫోర్స్ కేసు ముగిసిపోయింది. ఇప్పుడు ఖత్రోకీ మరణంతో బోఫోర్స్ కేసులో ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొన్న అందరూ దాదాపుగా మరణించినట్టే. బోఫోర్స్ మరక అంటిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురి కాగా, బోఫోర్స్ సంస్థ అధినేత మార్టిన్ ఒర్డబో, ఏజెంట్ విన్ చద్దా, మాజీ రక్షణ కార్యదర్శి ఎస్‌కే భట్నాగర్‌లు కేసు విచారణ క్రమంలోనే మరణించారు. ఇక మిగిలింది హిందూజా సోదరులు. వారిని 2000లో కోర్టు నిర్దోషులుగా ప్రకటించి వదిలేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+