లాస్ట్ డే: టెలిగ్రామ్ కోసం క్యూ, చివరిది రాహుల్ గాంధీకి
న్యూఢిల్లీ: నూటా అరవై మూడేళ్ల పాటు సేవలు అందించిన టెలిగ్రామ్ ఆదివారం రాత్రితో చరిత్ర పుటల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. టెలిగ్రామ్ పంపించేందుకు చివరి రోజు కావడంతో చాలామంది టెలిగ్రామ్ సెంటర్ల వద్ద పంపించాలనే కుతూహలంతో క్యూ కట్టారు. అది చరిత్ర పుటల్లోకి ఎక్కనున్న నేపథ్యంలో ఆసక్తి కోసం చాలామంది టెలిగ్రామ్ పంపించేందుకు వచ్చారు.
అర్ధరాత్రి వరకు తమ ఆప్లులకు పలువురు టెలిగ్రామ్ పంపించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో చివరి టెలిగ్రామ్‌వు కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఓ వ్యక్తి పంపాడు. జన్‌పథ్‌లోని సెంట్రల్ టెలిగ్రాఫ్ కార్యాలయంలో అశ్వని మిశ్రా అనే వ్యక్తి రాహుల్‌తో పాటు డిడి న్యూస్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎం ఖాన్‌కు పంపించాడు.

రాత్రి పదకొండు గంటల నలభై అయిదు నిమిషాలకు దీనిని పంపించాడు. ఆఖరు రోజు రూ.68,837 కలెక్ట్ అయింది. ఆదివారం మొత్తం బుకింగ్స్ 2,197గా ఉన్నాయి. టెలిగ్రామ్ పంపించేందుకు యువత కూడా ఆసక్తి కనబర్చారు. చాలామంది మొదటిసారి పంపించారు.
దేశవ్యాప్తంగా 75 చోట్ల ఉన్న టెలిగ్రామ్ ఆఫీసుల్లోని యంత్రాలు మూలనపడ్డాయి. ప్రస్తుతం టెలిగ్రామ్ విభాగంలో ఉన్న దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను బిఎస్ఎన్ఎల్ ఇతర సేవలకు ఉపయోగించుకోనుంది. టెలిగ్రామ్ ఒకప్పుడు తపాలా పరిధిలో కొనసాగినా.. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ పరిధిలోకి వచ్చింది. ఆదివారం చరిత్రపుటల్లోకి ఎక్కింది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications