వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపిగా నటి రమ్య ప్రమాణం, సభలో విహెచ్‌పి యాత్ర, టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్నాటక ఉప ఎన్నికల్లో మాండ్య, బెంగళూరు రూరల్ స్థానాల నుండి గెలుపొందిన రమ్య, డికె సురేష్‌లు సోమవారం ఉదయం పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. లోకసభ స్పీకర్ మీరా కుమార్ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే వారిచే ప్రమాణం చేయించారు.

కాగా, విశ్వ హిందూ పరిషత్ కోసి పరిక్రమ యాత్ర ఉత్తర ప్రదేశ్‌లో వివాదం రగిలించిన విషయం తెలిసిందే. ఆదివారం పలువురు విహెచ్‌పి నేతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. దీనిపై బిజెపి పార్లమెంటులో నిలదీసింది.

Ramya and Sureksh take oath Lok Sabha MP

రాజ్యసభలో ఎస్పీ, బిజెపి సభ్యుల పోటాపోటీగా నినాదాలు చేశారు. చైర్మన్ శాంతించాలని కోరినా సభ్యులు వినలేదు. మరోవైపు టిడిపి ఎంపీలు సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

కాగా, విహెచ్‌పి యాత్ర పైన ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పందించారు. సాధు సంతులను అవమానపర్చడం తమ ప్రభుత్వం ఉద్దేశ్యం కాదని చెప్పారు. బిజెపి సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయోధ్య విషయంలో యథాస్థితి కాపాడాలని సుప్రీం ఆదేశాలు ఉన్నాయని, కోర్టు ఆదేశాలను యుపి ప్రభుత్వం నిక్కచ్చిగా పాటిస్తోందన్నారు.

English summary

 Lok Sabha by polls Congress Ramya- DK Suresh take oath as Lok Sabha MPs. The two members, who were elected in the recent Lok Sabha bye-polls held for Mandya and Bangalore Rural constituencies, took oath in the house on Monday. Lok Sabha Speaker Meira Kumar administered the oath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X