వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడేళ్లుగా 14 మందిపై వార్డెన్ అత్యాచారం, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఈటానగర్: ఓ హాస్టల్ వార్డెన్ గత కొన్ని ఏళ్లుగా పద్నాలుగు మంది మైనర్ బాలికల పైన అత్యాచారానికి పాల్పడిన సంఘటన అరుణాచల్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని వెస్య్ సియాంగ్ జిల్లా లికాబాయిలోని ఓ ప్రయివేటు పాఠశాలలో వార్డెన్ ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాడు.

ఈ విషయాన్ని కొద్ది రోజులుగా విద్యార్థులు బయటకు చెప్పేందుకు భయపడ్డారు. అయితే, బాధితుల్లో కొందరు దీనిని పోలీసులకు తెలియజేశారు. అత్యాచార బాధిత బాలికలలో నాలుగేళ్ల నుండి పదమూడేళ్ల వరకు ఉన్నారు.

Hostel warden held for raping 14 girls

విషయం తెలిసిన స్థానికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. వారు స్థానిక పోలీసు స్టేషన్‌ను ముట్టడించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ విషయం కొద్దిమంది విద్యార్థులు తమకు తెలిపారని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిందితుడు, రాష్ట్రేతరుడైన విపిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరో ఇద్దరిని విచారించారు.

కేసు నమోదు చేసుకున్నామని, విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు. బాధిత బాలికలు గత మూడేళ్లుగా ఆ పాఠశాలకు వెళ్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నిందితుడు విద్యార్థులను హెచ్చరించారని చెప్పారు.

English summary
A shocking case of rape of 14 minor girls allegedly by the hostel warden of a private school in Likabai in West Siang district has come to light after a few students reported the matter to police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X