విషాదం: అమెరికాలో జలపాతంలో పడి తెలంగాణ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
ఆదిలాబాద్: అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. కన్నకొడుకు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని భోరిగాం గ్రామానికి చెందిన
ఏలేటి లక్ష్మారెడ్డి, శోభ దంపతుల చిన్న కుమారుడు నిహార్ రెడ్డి(31) మూడేళ్ల నుంచి అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటున్నాడు. అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గత ఆదివారం నిహార్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. అయితే, ప్రమాదవశాత్తు నిహార్ రెడ్డి సమ్మమిష్ లేక్‌లో పడి గల్లంతయ్యాడు.

ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకోగా.. నిహార్ రెడ్డి కోసం తీవ్రంగా గాలించారు. చివరకు నిహార్ రెడ్డి మృతదేహాన్ని గుర్తించిన రెస్క్యూ సిబ్బంది జలపాతం నుంచి బయటకు తీశారు.
కాగా, సోదరుడు నిఖిల్ రెడ్డితో కలిసి అమెరికాలోనే స్థిరపడిన నిహార్ రెడ్డి.. రెండేళ్ల క్రితమే హైదరాబాద్ నగరానికి చెందిన ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నిహార్ రెడ్డి భార్య కావ్య ఏడు నెలల గర్భవతి. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితమే ఏలేటి లక్ష్మారెడ్డి, శోభ దంపతులు కొడుకుల వద్దకు వెళ్లారు.
Recommended Video
ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు దినం కావడతో నిహార్ రెడ్డి కుటుంబ సమేతంగా అమెరికాలోని సమ్మమిస్ లేక్ సందర్శనకు వెళ్లారు. లేక్ అందాలను చూస్తూ ఆకస్మాత్తుగా కాలుజారి జలపాతంలో పడిన నిహార్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. నిహార్ రెడ్డి మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. నిహార్ రెడ్డి భార్య, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. నిహార్ రెడ్డి దంపతులు ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.












Click it and Unblock the Notifications