తెరపైకి కొత్తపేరు.. మాజీ మంత్రి కిం కర్తవ్యం?
ఆదాయపు పన్నుశాఖ అధికారులుగా అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడటం ఒక కేసు కాగా, మరొకటి స్థలం వివాదం.
తల్లిదండ్రుల నుంచి వచ్చిన పేరును ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలవడంతోపాటు టీడీపీలోకి వచ్చి మంత్రి పదవిని దక్కించుకున్నారు భూమా అఖిలప్రియ. 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ఆమె గ్రాఫ్ రోజురోజుకు తగ్గిపోతూ వస్తోంది. హైదరాబాద్ లో చోటుచేసుకున్న రెండు విషయాల్లో కేసుల చిక్కుముళ్లు ఆమెను విడిచిపెట్డడంలేదు.

సమస్యల చిక్కుముళ్లలో అఖిలప్రియ
ఆదాయపు పన్నుశాఖ అధికారులుగా అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడటం ఒక కేసు కాగా, మరొకటి స్థలం వివాదం. వీటి నుంచి ఆమె చిక్కులు ఎదుర్కోవడమేకాదు.. తన రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడే పరిస్థితిని తెచ్చుకున్నారు. రెండో వివాహం చేసుకున్న తర్వాతే సమస్యల చిక్కుముళ్లలో చిక్కుకున్నారు. రాజకీయాల్లో తానొక ఫైర్ బ్రాండ్ అంటూ తనను తానే అభివర్ణించుకునే భూమా అఖిలప్రియ వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో తడబడుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం అమ్మ అయితే, నంద్యాల నియోజకవర్గం నాన్న అని అభివర్ణిస్తారు.

తెరపైకి ఏవీ సుబ్బారెడ్డి పేరు
నియోజకవర్గాల్లో పార్టీ పరంగా ఆమెకు అండ కూడా కరవవుతోంది. అఖిలప్రియకు ప్రత్యర్థిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డివైపే అందరూ నిలుస్తున్నారు. ఆయనతో వియ్యమందుకున్న బొండా ఉమా ఆళ్లగడ్డలో పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన వియ్యంకుడికి సీటిప్పించుకోవడమే కాకుండా ఆయన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్నటివరకు బీజేపీ నాయకుడిగా ఉన్న వ్యక్తిని టీడీపీలోకి తెచ్చి సీటివ్వాలని ప్రయత్నించారు. అయితే అనుకోకుండా ఏవీ సుబ్బారెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

ఏం జరుగుతుందో చూడాలి?
చంద్రబాబు దగ్గర ఉన్న ఇమేజ్‌తో బొండా ఉమా.. ఆళ్లగడ్డలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని .. సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సూత్రప్రాయంగా చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే నంద్యాల టికెట్‌ను శిల్పా రవికి ఇస్తున్నట్టు అఖిల ప్రియే నాలుగు రోజులుగా మీడియాకు వెల్లడిస్తున్నారు. ఈ విషయమై ఆమె చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications