ఏప్రిల్ 7నుండి అమరావతిలో హైకోర్టు : నోటిఫై చేసిన రాష్ట్రపతి..
ఎట్టకేలకు హైకోర్టు విభజనకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విభజన తరువాత హైకోర్టును సైతం విభజించాలని తెలం గాణ ప్రాంత న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. అమరావతిలో హైకోర్టు భవనం నిర్మాణం పూర్తవుతే..వెంటనే హైకోర్టు విభజన పూర్తి చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అమరావతి లో జస్టిస్ సిటీ నిర్మాణం తుది దశకు చేరుకోవటంతో..వచ్చే వేసవి సెలవుల్లో అంటే ఏప్రిల్ 7వ తేదీన ఏపి హైకోర్టు అప్పాయింటెడ్ డే గా రాష్ట్రపతి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు..
ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఒక్కటిగా ఉన్న ఏపి హైకోర్టు ఇక..ఏపి-తెలంగాణ హైకోర్టుగా విడిపోనుంది. రాష్ట్ర విభజన నాటి నుండి హైకోర్టు విభజన పై తెలంగాణ ప్రాంత న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. అదే విధంగా కోర్టుతో పాటుగా న్యాయ మూర్తుల విభజన చేయాలని డిమాండ్ చేసారు. కొద్ది రోజుల క్రితం న్యాయమూర్తుల విభజన తో పాటు గా సిబ్బంది విభజన పూర్తయింది. ఏపిలో హైకోర్టు నిర్మాణం పూర్తయితే..హైకోర్టును ఏపిలో ఏర్పాటు చేయటానికి తమ కు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో..ఏపి ప్రభుత్వం సైతం అమరావతి లో నేలపాడు గ్రామంలో హైకోర్టు నిర్మాణం చేపట్టామని..ఈ ఏడాది చివరికి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది.

ఈ నిర్మాణాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా న్యాయమూర్తులంతా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. ఇదే నివేదికను సుప్రీం కోర్టుకు నివేదించారు. ఏపిలో హైకోర్టు నిర్మాణం డిసెంబర్ చివరికి పూర్తి కాగానే.. సంక్రాంతి సెలవు ల అనంతరం తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఇక, అధికారికంగా ఏపి హైకోర్టు 2019, ఏప్రిల్ 7వ తేదీన పని చేయటం ప్రారంభం కానుంది. ఆ రోజు ఉగాది కావటం తో ఆనాటి నుండే హైకోర్టు అప్పాయింటెడ్ డే గా ప్రకటిస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసారు. దీంతో..ఇక నూతన ఏపి లో కొత్త హైకోర్టు వచ్చే ఉగాది నుండి ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications