దేవదాయశాఖలో అవినీతి నిజమే.. కొత్త మంత్రి కొట్టు సెన్సేషనల్ కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కొత్త మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే ఒక్కో మంత్రి వీలును చూసుకొని పదవీ ప్రమాణం చేస్తున్నారు. ఇవాళ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవీని కూడా సీఎం జగన్ ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖలో అవినీతి నిజమేనని అంగీకరించారు. తాను మాత్రం అవినీతిని నిర్మూలించే దిశగా పనిచేస్తానని తెలిపారు. మంత్రి చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి.
విజయవాడలో తన శాఖ కార్యాలయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. ఇకపై ఆలయాల్లో సామాన్యులకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వీఐపీలను ఒకేసారి పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాదని తెలిపారు. మెల్ల మెల్లగా అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కానీ కరప్షన్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తానని కామెంట్ చేశారు. ఇదీ ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతుంది.

ఆలయాల్లో ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులను మార్చే ప్రయత్నం చేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. బదిలీలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. ఇటు గతంలో దేవదాయశాఖ మంత్రి పదవీని వెల్లంపల్లి శ్రీనివాస్ చేపట్టారు. ఆ శాఖ భూములపై రగడ నెలకొన్న సంగతి తెలిసిందే. అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టిన.. అదేం లేదని ప్రభుత్వమే చెప్పింది. ఇక మంత్రివర్గ కూర్పులో వెల్లంపల్లికి మరోసారి అవకాశం లభించలేదు.
ఇందుకు కారణం గతంలో జరిగిన అవినీతికి సంబంధించి అవకాశం ఇవ్వలేదా అనే సందేహం వస్తోంది. దానికి బలం చేకూర్చేటట్టు.. కొట్టు కామెంట్స్ చేశారు. మరీ ఈ వ్యాఖ్యలు అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి వ్యుహం అమలు చేయనుందో చూడాలీ. అలాగే టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలీ. కానీ కొట్టు కామెంట్స్ మాత్రం కలకలం రేపాయి.












Click it and Unblock the Notifications