ఫ్రెండ్స్ ఎక్కువ‌..! ఫండ్స్ త‌క్కువ‌..! ప‌వ‌న్ నోరు జార‌డం వెన‌క కార‌ణం ఏంటి..?

Recommended Video

    Pawan Kalyan's America Tour,What Is The Reason Behind Pawan's Speech..? | Oneindia Telugu

    హైద‌రాబాద్/ఏపి: పార్టీ ఫండ్స్ విష‌యంలో జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు జారారా..? పార్టీని న‌డిపించేందుకు స‌రైన మూల‌ధ‌నం లేక ఇబ్బందులు ప‌డుతున్నారా..? అందుకే అభ‌ద్ర‌తా భావంతో అచేత‌నంగా అసంద‌ర్బ వ్యాఖ్య‌లు చేస్తున్నారా..? అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ ఫండ్స్ గురించి, పార్టీని ముందుకు న‌డింపించ‌డానికి ఎంత ఖ‌ర్చ‌వుతుంద‌నే అంత‌ర్గ‌త వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేయ‌డంతో అంత‌రార్థం ఏంటి..? ప‌వ‌న్ వ్యాఖ్యల వెన‌క నిగూడార్థం గ్ర‌హించిన రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం ప‌వ‌న్ అన‌వ‌స‌రంగా బుజాలు త‌డుముకుంటున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత‌కి వ‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్రెండ్స్ విష‌యంలో, ఫండ్స్ విష‌యంలో ఏమ‌న్నారు.? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

    పార్టీ ఫండ్స్ విష‌యంలో ప‌వ‌న్ ఆవేశం..! అసంద‌ర్బ వ్యాఖ్య‌ల‌తో ఇరుకున ప‌డ్డ సేనాని..!!

    పార్టీ ఫండ్స్ విష‌యంలో ప‌వ‌న్ ఆవేశం..! అసంద‌ర్బ వ్యాఖ్య‌ల‌తో ఇరుకున ప‌డ్డ సేనాని..!!

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ‌కీయాల్లో వేగం పెంచేరు. తెలుగుదేశం పార్టీతో విభేదించిన తర్వాత ఆ పార్టీ నేతలపై, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజాపోరాట యాత్ర పేరిట రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్న పవన్, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త‌గ్గ క‌స‌ర‌త్తులు కూడా ప్రారంభించేసారు జ‌న‌సేనాని.

    ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్న ప‌వ‌న్..! అందుకే దూకుడు పెంచిన గ‌బ్బ‌ర్ సింగ్..!!

    ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్న ప‌వ‌న్..! అందుకే దూకుడు పెంచిన గ‌బ్బ‌ర్ సింగ్..!!

    పార్టీని సంస్థాగతంగా బలపరిచేందుకు ఇప్పటికే రాష్ట్రంలోని చాలామంది సీనియర్లను తన పార్టీలో చేర్చుకున్నారు. మరికొందరితో మంతనాలు కూడా జరిపార‌ని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జనసేనలోకి మరిన్ని వలసలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, గోదావరి జిల్లాల్లో పర్యటనలు పూర్తి చేసిన జనసేనాని, ఇటీవల అనంతపురం జిల్లాలోనూ యాత్రను ముగించారు.

    అమెరికాలో ప‌వ‌న్..! పార్టీ ఫండ్స్ గురించి ప్ర‌స్థావ‌న‌..!!

    అమెరికాలో ప‌వ‌న్..! పార్టీ ఫండ్స్ గురించి ప్ర‌స్థావ‌న‌..!!

    తాజాగా పవన్‌ కల్యాణ్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో కలసి అమెరికాలో వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘నేనిక్కడికి ఫండ్స్ వసూలు చేయడానికి రాలేదు. నేనెప్పుడూ ఎవరితోనూ డబ్బులు కలెక్ట్ చేయమని చెప్పను. ఏదైనా ఉంటే ఆఫీషియల్స్‌తో చెప్తాను. అది కూడా నాకు ఇష్టం ఉన్నప్పుడే. అసలు డబ్బులు దేనికి అని నన్ను చాలా మంది అడుగుతుంటారు. పవన్ కల్యాణ్ ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాలంటే ఒక్కడే వస్తాడా..? నాతో పాటు నాలుగు వందల మంది కదలాలి.. 40 కార్లు రావాలని అన్నారు క‌ళ్యాణ్.

    పార్టీ ఫండ్స్ వ‌సూలు చేయాల్సిన అవ‌సం లేదు..! క‌ల‌వ‌రానికి గురిచేస్తున్న వ్యాఖ్య‌లు..!!

    పార్టీ ఫండ్స్ వ‌సూలు చేయాల్సిన అవ‌సం లేదు..! క‌ల‌వ‌రానికి గురిచేస్తున్న వ్యాఖ్య‌లు..!!

    అమెరికన్ ప్రభుత్వం త‌మకు పోలీసులను ఇవ్వగలుగుతుంది కానీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను ఇవ్వడంలేదు'' అంటూ వ్యాఖ్యానించాడు. వాస్తవానికి పవన్ ఫండ్స్ వసూలు చేయడానికే అమెరికా వెళ్లాడని ఎవరూ అనలేదు. ఇలాంటి సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఎవరూ అనకపోయినా ఫండ్స్ గురించి మాట్లాడడం, భుజాలు తడుముకున్నట్లే ఉంది. గతంలోనూ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఫండ్స్ వసూలు చేస్తూ జనసేన నేతలు మీడియా కంట పడిన విషయం సంచ‌ల‌నంగా మారింది. మ‌రిప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ ఫండ్స్ గురించి ఎవ‌రూ ప్ర‌స్థావించ‌క పోయిన‌ప్ప‌టికి ఎందుకు ఆ విధంగా స్పందించార‌నే అంశం పై పెద్ద ఎత్తుల చ‌ర్చ జ‌రుగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+