పీఆర్సీ జీవో వెనక్కి తీసుకోవడం కుదరదు, ఉద్యోగ జేఏసీకి సజ్జల స్పష్టీకరణ
పీఆర్సీ కోసం ఉద్యోగులు పట్టుబడుతూనే ఉన్నారు. ప్రభుత్వం మాత్రం జీవో వెనక్కి తీసుకోవడం వీలు కాదని చెబుతోంది. దీంతో 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె అనివార్యం కానుంది. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి కామెంట్స్ చేశారు. కొత్త పీఆర్సీపై ఇప్పటికే జీవోలు ఇచ్చేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జీతాలు అకౌంట్ లో పడబోతున్నాయని చెప్పారు. ఇప్పుడు జీవోలను వెనక్కి తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు.
ఉద్యోగులు ఇకనైనా ఆందోళనలు విరమించుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆందోళనలు విరమించడం కుదరదని ఉద్యోగులు చెప్పారని పేర్కొన్నారు. ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో ఉందని తెలిపారు. సమస్యలపై మాట్లాడాలని ఉద్యోగులను కోరామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు పీఆర్సీ వేశామని చెప్పామని పేర్కొన్నారు.

ఆలస్యంగానైనా చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని వివరించారు. కమిటీ ముందు స్టీరింగ్ కమిటీ మూడు ప్రతిపాదనలు ఉంచిందని చెప్పారు. అశుతోష్ మిశ్రా రిపోర్టు బయటపెట్టాలని స్టీరింగ్ కమిటీ కోరిందని.. పీఆర్సీ జీవోల రద్దు, పాత జీతాలు వేయాలని ప్రతిపాదనలు చేసింది.
జీతాల విషయంలో ప్రభుత్వానికి తొందర ఎందుకని ప్రశ్నించింది. చర్చలు జరిపి మళ్లీ చెబుతామని మంత్రులు కమిటీ వెల్లడించింది. సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్టీరింగ్ కమిటీకి సూచించింది. ఈ సాయంత్రం అందరికీ జీతాలు వేస్తున్నామని మంత్రుల కమిటీ తెలిపింది.
రాష్ట్రంలో పీఆర్సీ వివాదం ముదురుతోంది. ఈ విషయంలో ఇటు ప్రభుత్వం కానీ.. అటు ఉద్యోగులు కానీ వెనక్కి తగ్గడం లేదు. తమ డీఏలు, హెచ్ఆర్ఏ, పాత బకాయిలు కలపడం వలనే తమకు జీతం పెరిగిందని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని.. అవి తమకు రావలసిన బకాయిలు మాత్రమే అనేది ఉద్యోగుల అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తమపై నెలకు రూ.10 వేల కోట్లపై భారం పడుతుందని పేర్కొంది. కానీ ఉద్యోగుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications