అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుఫాన్ ఎఫెక్ట్: ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షం..

|
Google Oneindia TeluguNews

అతి తీవ్ర తుపాను 'యస్' తీరం వైపుగా పయనిస్తోంది. వాతావరణశాఖ ప్రకటన ప్రకారం ప్రస్తుతం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను... 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. 26వ తేదీ మధ్యాహ్నం ఉత్తర ఒడిశా - పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

యస్ తుఫాన్ ఇంపాక్ట్ బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ తెలియజేసింది. ఎండలతో తల్లిడిల్లుతోన్న జనాలకు ఇదీ మంచి వార్తే.. కానీ వరి, ఇతర ధాన్యం విక్రయించే స్థితిలో అన్నదాతకు మాత్రం కాస్త ఇబ్బందిగా పరిణమించనుంది. పంట విక్రయం పూర్తయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Rain alert: heavy rains in uttarandra today and tomorrow.

యాస్ తుపాన్ ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందని వివరించారు. సముద్రంలో అలలు 2.90-4.5 మీటర్ల ఎత్తులో‌ ఎగసి పడతాయన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తీరప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు హెచ్చరించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్ర అలలు 2.9 మీటర్ల నుంచి 4.5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని చెప్పింది. తీరప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దీంతో అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. తీరం వెంబడి ఉన్న జనాలు అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. ఈదురుగాలులు వీయడంతో కరెంట్ సరఫరా నిలిపివేస్తామని తెలియజేశారు. వృక్షాలు కూలే అవకాశం ఉండటంతో.. ఆ పక్కన ఎవరూ ఉండొద్దని స్పష్టంచేశారు.

English summary
Rain alert: heavy rains in uttarandra today and tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X