అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్‌పై రోజా సెటైర్లు.. మరోసారి రెండుచోట్ల ఓటమే, ఆ పార్టీల కోసమే ఆరాటం..

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. పొత్తుల గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావించిన మూడు ఆప్షన్ల కామెంట్లపై స్పందించారు. పవన్ మూడు ఆప్షన్లు ఇస్తే ప్రజలు ఆయనకు ఒకటే ఆప్షన్ ఇస్తారన్నారు. జనసేన పార్టీని ప్రజలు గెలిపించే ప్రసక్తే లేదన్నారు. 175 స్థానాల్లో పోటీ చేయకుండానే పవన్ సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు. పవన్‌ పోరాటం ప్రజల కోసం కాదని, పొత్తుల కోసమేన‌ని విమర్శించారు.

రెండు చోట్ల ఓటమే

రెండు చోట్ల ఓటమే


2024 ఎన్నిక‌ల్లో కూడా పవన్ ఓడిపోతారని చెప్పారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా టీడీపీ, జనసేన సపోర్ట్ చేస్తాయని తెలిపారు. ప్రజలు వైసీపీనే గెలిపిస్తారని అన్నారు. పోరాటాల పార్టీ, ప్రజల కోసం పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్.. ప్రజల కోసం పోరాడకుండా షూటింగ్స్ చేసుకుంటూ.. ఎన్నికలు వచ్చినప్పుడు మరి దేనికోసం వస్తారో తెలియదన్నారు.

వారికోసమే పవన్ ఆరాటం

వారికోసమే పవన్ ఆరాటం


బీజేపీకి ఓటు వేయండి, టీడీపీకి ఓటు వేయండి.. వచ్చేస్తా.. సీఎం అంటారు. 175 చోట్ల పోటీ చేయకుండా పవన్ సీఎం ఎలా అవుతారని అడిగారు. ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తారు? ఇక చంద్రబాబు పార్టీ చూస్తే.. లోకేష్ స్వయంగా చిట్ చాట్‌లో చెప్పారు. 50 చోట్ల అభ్యర్థులే లేరని. మరి 175 స్థానాల్లో 50 చోట్ల అభ్యర్థులే లేరని చెబితే ఏ విధంగా టీడీపీ వాళ్లు అధికారంలోకి వస్తారని రోజా ప్రశ్నించారు.

బాబుపై విమర్శలు

బాబుపై విమర్శలు


టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనా మంత్రి రోజా విమర్శలు చేశారు. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైసీపీకి వస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. బద్వేలు ఉప ఎన్నిక‌లో బీజేపీకి వెనుక నుంచి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. బీజేపీ వాళ్లు ఎందుకు పోటీ చేస్తున్నారో కనీసం వాళ్లకైనా అర్థం అవుతుందో లేదో అన్నారు. బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొందన్నారు

English summary
minister roja slams janasena chief pawan kalyan on alliance
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X