అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్ర‌బాబు ను క్ష‌మించ‌రు : ఏపి ప్ర‌జ‌లు ఎలా అంగీక‌రిస్తారు : ప‌్ర‌ధాని ఫైర్‌..

|
Google Oneindia TeluguNews

టిడిపి అధినేత చంద్రబాబు పై ప్ర‌ధాని మోదీ నేరుగా ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించి విజయం సాధించారన్నాని.. అయితే, ఎన్టీఆర్‌ ఆశయాలకు నీళ్లొదిలి కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకున్న ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు క్షమించబోరని ప్ర‌ధాని మోదీ విరుచుకుప‌డ్డారు. మ‌హా కూట‌మి పేరుతో జ‌త క‌డుతున్న‌వారు వ్య‌క్తిగ‌త స్వార్ధాల కోస‌మేన‌ని విమ‌ర్శించారు.

బ‌తికామో..చచ్చామో చూడ్డానికా : జ‌న‌వ‌రి 1న ఏపిలో టిడిపి నిర‌స‌న‌లు : బాబు టార్గెట్ మోదీ..! బ‌తికామో..చచ్చామో చూడ్డానికా : జ‌న‌వ‌రి 1న ఏపిలో టిడిపి నిర‌స‌న‌లు : బాబు టార్గెట్ మోదీ..!

ప్ర‌ధాని మోదీ పార్టీ కార్య‌క‌ర్త‌లతో జ‌రిగిన టెలికాన్ఫిరెన్స్ లో తెలుగు దేశం అధినేత ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ తో టిడిపి జ‌త క‌ట్ట‌టం పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఆనాడు సొంత పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (టి.అంజయ్య)ని కాంగ్రెస్‌ అవమానించింది. ఫలితంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ ఎన్టీఆర్‌.. టీడీపీని స్థాపించారు. అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలపాలనుకుంటోంది. ఆ రాష్ట్ర ప్రజలు దీన్నెలా అంగీక రిస్తారు..

P.M Narendra Modi hits out TDP : Ties personal ambitions..

అని ప్ర‌ధాని ప్ర‌శ్నించారు . ఎన్టీఆర్ ఆశ‌యాల‌కు తిలోద‌కాలిచ్చి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ను ఏపి ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ క్ష‌మించ‌ర‌ని మోదీ విమ‌ర్శించారు. ఒక‌వైపు మోదీ ఏపిని నిర్ల‌క్ష్యం చేసిన కార‌ణంగానే..తాము కాంగ్రెస్ తో క‌ల వాల్సి వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు చెబుతుంటే...ప్ర‌ధాని మోదీ చంద్ర‌బాబు లక్ష్యంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. జ‌న‌వ‌రి 6న ప్ర‌ధాని ఏపికి రానున్నారు.ఆ స‌భ ద్వారా రెండు పార్టీల మ‌ధ్య మ‌రింత రాజ‌కీయ వేడి పెరిగే అవకాశం ఉంది.

స్వ‌లాభం ..ప‌ద‌వుల కోసం..

కాంగ్రెస్ తో జ‌త క‌ట్టిన ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ప్ర‌ధాని టార్గెట్ చేసారు. ఇటీవల మహా కూటమి అంటూ మాట్లాడుతు న్న నేతలకు స్వలాభం, పదవుల యావ తప్ప మరేమీ లేదని విమర్శించారు. ఈ కూటమి అపవిత్ర కూటమి అని నిప్పులు చెరిగారు. అందులో ఉన్న పార్టీల నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్‌ పోకడలతో భంగపడిన వారేనని అన్నారు. సోషలిస్ట్‌ నేత రామ్‌ మనోహర్‌ లోహియానే తమకు ఆదర్శమని చెప్పుకుంటున్న ఈ నేతలు.. పార్టీ సిద్ధాంతాలు, జాతిహితంపై రాజీపడే పార్టీగా కాంగ్రెస్‌ను ఆయన తిట్టిపోసేవారని గుర్తుంచుకోవాలి. కూటమి నేతలు ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపిన వారే. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ను అక్రమ కేసులతో కాంగ్రెస్‌ వేధించింది. గతంలో కాంగ్రెస్, డీఎంకేల నడుమ బద్ధవైరం ఉన్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తమిళనాడులో డీఎంకే అయినా ఉండాలి లేదా తామైనా ఉండాలని అప్పట్లో విర్రవీగిన కాంగ్రెస్‌.. నేడు ఆ పార్టీతో అంటకాగడం అవకాశవాదం తప్ప మరేమీ లేదని మోదీ విమ‌ర్శించారు. ఇప్పుడు మోదీ నేరుగా టిడిపి అధినేత ను టార్గెట్ చేయ‌టం తో ఇప్పుడు టిడిపి నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి..

English summary
P.M Narendra Modi hits out oppsition. He politically target Chandra babu on alliance with congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X