పోసాని రియాక్షన్: జగన్‌పై కామెంట్స్ చేస్తే, 100 అడుగుల లోతులో అంటూ..
ఏపీలో భీమ్లా నాయక్ మూవీకి సంబంధించి రగడ జరుగుతోంది. సినిమా టికెట్ల అంశంపై అధికార వైసీపీ జనసేన/ పవన్ ఫ్యాన్స్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఇంతలో సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి రంగంలోకి దిగారు. సీఎం జగన్‌ను ఏమైనా అంటే ఊరుకుంటామా అని ఫైరయ్యారు. జగన్ మీద నిందలు వేస్తేవంద అడుగుల లోతులో పాతుకపోతాడంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో వివాదం అగ్గిరాజేసింది.

పోసాని రియాక్షన్..
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా టికెట్ల విషయంలో విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై పోసాని స్పందించారు. భీమ్లా నాయక్ సినిమాకు టికెట్ల గురించి తనకు తెలియదని, తాను సినిమా వాడినే గానీ దాని గురించి తనకు తెలియదన్నారు. భీమ్లా నాయక్ సినిమాను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించడం సరి కాదని కామెంట్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్లు సాక్ష్యం ఉంటే చూపెట్టాలని సూచించారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు పోసాని కృష్ణమురళి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే కామెంట్స్ చేశారు..

ఇవాళ భేటీ కావడంతో..
సీఎం జగన్‌తో పోసాని సమావేశం అయ్యారు. గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల వివాదం నడుస్తోన్న క్రమంలో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. టికెట్ల విషయంలో చర్చిస్తారని ప్రచారం జరిగింది. తమ కుటుంబం కరోనాతో భాదపడుతున్న సమయంలో సీఎం, ఆయన సతీమణి మాట సాయం చేశారని తెలిపారు. ఏఐజి ఆసుపత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలపడానికి వచ్చానని వివరణ ఇచ్చారు.

నిర్ణయం తీసుకోలేదే..
సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చిన్న సినిమాల నుండి ప్రతిపాదనలు అందాకే టికెట్ల ధరలపై నిర్ణయం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చశారు. సీఎం జగన్ తో జరిగిన సమావేశంలో సినిమా టికెట్ల ధరలపై చర్చించలేదని పోసాని స్పష్టంచేశారు. ఆలీకి ఇచ్చినట్టే తనకు పదవి ఇస్తున్నారనడంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు.

5వ షో ఇక్కడ.. అక్కడ మాత్రం..
భీమ్లా నాయక్ మూవీ తెలంగాణలో అయిదవ షో పర్మిషన్లు ఇచ్చారు. బెనిఫిట్ షో కూడా పడుతున్నాయి, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. అటు ఏపీలో మాత్రం పరిస్థితి అలా లేదు. సినిమా రిలీజ్ ఉండటంతో థియేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సినిమా బెనిఫిట్ షోలు వేసినా, ఎక్స్ ట్రా షోలు వేసినా, ప్రభుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. పలు నగరాల్లో పవన్ అభిమానులు నిరసనలు తెలిపారు. మంత్రి పేర్ని నాని, కొడాలి నానిను అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications