అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బస్సుపై రాళ్లు, చెప్పుతో దాడి, పోలీసుల తీరు.. మంగళవారం గవర్నర్‌తో టీడీపీ నేతల భేటీ..

|
Google Oneindia TeluguNews

అమరావతి రాజధాని పర్యటనలో బస్సుపై దాడి ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. మంగళవారం అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ప్రభుత్వ ప్రోద్బలంతోనే దాడి జరిగినట్టు గవర్నర్‌కు టీడీపీ నేతల బృందం విన్నవించనుంది.

నిపుణుల కమిటీ నియామకాన్ని సవాల్‌ చేస్తూ రాజధాని కమిటీపై మరో పిటీషన్నిపుణుల కమిటీ నియామకాన్ని సవాల్‌ చేస్తూ రాజధాని కమిటీపై మరో పిటీషన్

గవర్నర్‌తో భేటీ..

గవర్నర్‌తో భేటీ..

అచ్చెన్నాయుడు నేత‌ృత్వంలో మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీ బృందం గవర్నర్‌ను కలువనుంది. వెంకటాయపాలెం వద్ద బస్సుపై దాడి గురించి ఫిర్యాదు చేస్తారు. చెప్పుతో దాడి చేశారని కూడా గవర్నర్‌కు తెలియజేస్తారు. ఆ సమయంలో పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వివరిస్తారు. పరిస్థితి బాగుందని 144 సెక్షన్ విధించలేదని ఏపీ డీజీపీ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.

28న పర్యటన..

గత నెల 28వ తేదీన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి రాజధాని అమరావతిలో పర్యటించారు. ప్రత్యేక బస్సులో పర్యటించిన వీరికి రాళ్లతో ఆందోళనకారులు స్వాగతం పలికారు. చంద్రబాబు బృందం బస్సు వెంకటాయపాలెం వద్దకు రాగానే ఆందోళనకారులు చెప్పు కూడా విసిరారు. చెప్పు విసిరింది ఆందోళనకారులు కాదని... వైసీపీ కార్యకర్తలని చంద్రబాబు ఆరోపించారు.

వైసీపీ కార్యకర్తలే..

వైసీపీ కార్యకర్తలే..

సీఎం జగన్‌ ప్రోద్బలంతోనే తమపై దాడికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో తమ పర్యటనను అడ్డుకోవడం సరికాదన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాలన్నారు. కానీ తాము అలా చేయలేదని, చేయబోమని చెప్పారు. అధికారం ఉందనే అండతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

మంత్రి తీరు సరికాదు..

మంత్రి తీరు సరికాదు..

రాజధానిని ఓ మంత్రి శ్మశానంతో పోల్చడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. సభ్యత, సంస్కారం ఉన్న మంత్రి అలా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. శ్మశానంలో ఉండి పనిచేస్తున్నారా అని నిలదీశారు. అసెంబ్లీ, కౌన్సిల్ శ్మశానంలో ఉందా ? ఇక్కడినుంచే మీరు చట్టాలు చేస్తున్నారా అని ఫైరయ్యారు. న్యాయం చెప్పే హైకోర్టు ఎక్కడ ఉంది ? ఇక్కడే కదా అని గుర్తుచేశారు. దీనిపై ఏమైనా మాట్లాడితే చాలు బూతు పురాణం వినిపిస్తున్నారని మండిపడ్డారు.

English summary
tdp leaders meet governer tuesday and complaint about bus attack incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X