చంద్రబాబుకు వరంగా పవన్ కన్ఫ్యూజన్ ? పొత్తు సంగతి తర్వాత ! బందరులోనూ తేల్చకపోతే మరీ నష్టం ?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నా ఓ కీలక అంశంపై పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుతో జనసేన కంటే టీడీపీ ఎక్కువగా లాభపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (pawan kalyan).. ఇప్పుడు ఆ ప్రయత్నంలో తనకు అండగా నిలుస్తున్న కాపు సామాజిక వర్గం విషయంలో అనుసరిస్తున్న గందరగోళ వైఖరితో తనతో పొత్తుకు ప్రయత్నిస్తున్న ప్రధాన విపక్షం టీడీపీకి పరోక్షంగా మేలు చేస్తున్నట్లే కనిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఓ రెండు ఘటనలే ఇందుకు నిదర్శనం. దీనిపై బందరు సభలో అయినా పవన్ క్లారిటీ ఇస్తారని సొంత సామాజిక వర్గం గంపెడాశలు పెట్టుకుంది.

ఏపీలో కాపు పాలిటిక్స్
ఏపీలో గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో కాపు రాజకీయాలు సాగుతున్నాయి. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల కంటే ఎక్కువగా జనాభా ఉన్నప్పటికీ ఐక్యంగా ఉండరనే విమర్శలు ఎదుర్కొనే కాపులు రాజ్యాధికారం కోసం ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వివిధ పార్టీల్ని ఆశ్రయిస్తున్నారు. అధికార వైసీపీలో కాపు అజెండాతో రాజకీయాలు చేసిన నేతలంతా ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎంలయ్యారు. అయితే సీఎం పదవి మాత్రం వారికి అందని ద్రాక్షగానే మిగులుతోంది. దీంతో ఇప్పుడు ఇదే అజెండాతో విపక్ష పార్టీలైన జనసేన, బీజేపీ, బీఆర్ఎస్ ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇందులో జాతీయ నాయకత్వం నిర్ణయాలపై ఆధారపడే బీజేపీతో పాటు కేసీఆర్ చేతుల్లో ఉండే బీఆర్ఎస్ ను వదిలేస్తే స్ధానికుడైన పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉాన్న జనసేన పార్టీపై కాపులకు ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. కానీ వాటిని అందుకోవడంలో ఆయన విఫలం అవుతున్నారు.

పవన్ కన్నా చిరంజీవే బెటర్ ?
గతంలో 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీని స్ధాపించి కాపులకు రాజ్యాధికారం లభిస్తుందనే ఆశలు రేపిన చిరంజీవివైపు భారీగా కాపులు మొగ్గారు. దీంతో అప్పటివరకూ టీడీపీకి మద్దతుగా ఉన్న కాపులంతా ప్రజారాజ్యంవైపు వెళ్లిపోయారు. అలాగే టీడీపీలో కాపు నేతలు సైతం ప్రజారాజ్యం బాట పట్టారు. అయితే చిరంజీవి నాయకత్వ వైఫల్యంతో ప్రజారాజ్యం ప్రయోగం విఫలం కావడంతో తిరిగి వారంతా వారి సొంత పార్టీలకు, ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా కాదు. కాపు అజెండాపై పూర్తిగా దృష్టిసారించడంలో విఫలమవుతున్న పవన్ కళ్యాణ్.. కనీసం తన అన్న చిరంజీవి నినాదమైన సామాజిక న్యాయం అజెండాను కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. దీంతో సొంత సామాజిక వర్గమైన కాపులు సైతం పవన్ ను పూర్తిగా నమ్మే పరిస్దితులు కనిపించడం లేదు.

కాపు సీఎం డిమాండ్ ఉన్నా..
మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో కాపు సీఎం డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 20 శాతం ఉన్న కాపులతో పాటు వారి ఉపకులాలైన బలిజ, ఒంటరి, తెలగ వంటి కులాలు కూడా కాపు సీఎం డిమాండ్ కు మద్దతిస్తున్నాయి. అలాగే కొత్తగా రాష్ట్రంలో అడుగుపెట్టిన కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ సైతం కాపు సీఎం డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీ కూడా పవన్ సహా కాపుల్లో ఎవరికైనా సీఎం పదవికి మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉంది. కానీ జనసేన మాత్రం అధికారికంగా కాపు సీఎం డిమాండ్ పై స్పందించడం లేదు. దీంతో కాపు సీఎం డిమాండ్ నూ పట్టించుకోక, కాపుల అజెండాను గట్టిగా రాష్ట్రంలో వినిపించలేక పవన్ సతమతం అవుతున్నట్లు కనిపిస్తోంది.

పవన్ కన్ఫ్యూజన్ తో చంద్రబాబు లాభం ?
కాపు అజెండాను బలంగా వినిపించే విషయంలో పవన్ లో నెలకొన్న ఈ గందరగోళం ఇప్పుడు టీడీపీకి పూర్తిగా బెనిఫిట్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో పార్టీల వారీగా చీలిపోయి ఉన్న కాపుల్ని ఒక్కటి చేయాలంటే పూర్తిగా కాపు అజెండాను తెరపైకి తీసుకురాక తప్పదు. అన్ని కులాలకు అనుకూలంగా ఉంటానంటే కుదరదు. కనీసం జగన్ తరహాలోనే సామాజిక న్యాయం అమలు చేస్తామన్న నమ్మకం అయినా కలిగించాలి. కానీ ఇందులో ఏ ఒక్కటీ చేసేందుకు పవన్ సిద్ధంగా లేరు. దీంతో సహజంగానే ఆయన సొంత సామాజిక వర్గం తమ బద్ధ శత్రువుగా భావించే టీడీపీవైపే చూడాల్సిన పరిస్దితి. తాజాగా జనసేనకు వెళ్లాలనుకుని తిరిగి టీడీపీలోకి వచ్చిన కన్నా, జనసేన వైపు చూసినా చివరికి టీడీపీలోనే ఉండేందుకు సిద్ధమైన వంగవీటి రాధా ఉదంతాలు కచ్చితంగా జనసేనకు మైనస్ గానే చెప్తున్నారు. మార్చి 14న బందరులో జరిగే జనసేన ఆవిర్భావ సభలో అయినా పవన్ కళ్యాణ్ కాపు అజెండాపై స్పష్టత ఇస్తే ఆ సామాజిక వర్గం గతంలో ప్రజారాజ్యం తరహాలో ఇప్పుడు జనసేన పార్టీవైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !!











Click it and Unblock the Notifications