మరదలిపై బావ కన్ను: కోరిక తీర్చాలని వేధింపులు.. చివరికీ వివాహిత..
బావ.. వరసకు అయినా మరదలిని సోదరిలా చూసుకోవాలి. మంచి, చెడు చెప్పాలి.. అండగా నిలవాలి. కానీ అతను మాత్రం తనలోని మరో కోణాన్ని చూపించాడు. కోరిక తీర్చాలని వేధించసాగాడు. భర్తకు చెప్పుకోలేక.. అతని కోరిక తీర్చలేక ఆ ఇల్లాలు కుమలిపోయింది. చివరకు ఆత్మహత్యాయత్నం చేసింది. చివరికీ చనిపోయింది. తాడేపల్లిలో జరిగిన ఘటన కలకలం రేపింది.
తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన జొన్న ఆదిశేషు రెండో కుమారుడు శ్రీనివాసరావుకు, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంకు చెందిన అన్నారావు, సత్యవతి కూతురు గీతాసురేఖకు 12 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త శ్రీనివాసరావు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తమ్ముని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న అన్న శివశంకర్ మరదలిపై కన్ను వేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిజేశాడు.

తీవ్ర మనస్థాపానికి గురయిన గీతాసురేఖ జనవరి 15 వ తేదీన పురుగుల మందు తాగింది. ఆ రోజు విజయవాడలో నివాసం ఉండే సురేఖ సోదరుడు రామకృష్ణ ఆమెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన రామకృష్ణ సాయంత్రం 4 గంటల సమయంలో ఉండవల్లిలోని సురేఖ ఇంటికి కూడా వచ్చారు. కుమారుడు, కోడలు బయటకు వెళ్లారని మామ ఆదిశేషు రామకృష్ణతో చెప్పారు. పిల్లల్ని కూడా బెదిరించారు. వారు అలాగే చెప్పి విలపించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
Recommended Video
గీతాసురేఖ ఆత్మహత్యాయత్నం చేసుకున్నా చెప్పకుండా దాచిపెట్టారు. బాధితురాలిని విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ నిన్న సురేఖ చనిపోయారు. బావ శివశంకర్, మామ ఆదిశేషుపై కేసు నమోదు చేయాలని సురేఖ బంధువులు డిమాండ్ చేశారు. తల్లి చనిపోయిందని తెలియడంతో పిల్లలు బోరున విలపించారు. మరదలిని వేధించిన శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications