ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కళ్యాణదుర్గం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video

2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎలాంటి కొత్త ప్రాంతాలు కలవలేదు. కళ్యాణదుర్గం నియోజకవర్గం 2009 లో జనరల్ గా మారింది. గతంలో మడకశిర నుండి గెలిచిన మాజీ మంత్రి..ప్రస్తుత పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి కళ్యాణ దు ర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. కోట్ల విజయభాస్కర రెడ్డి. వైయస్ క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసారు. మడకశిర నుండి ఆయన మూడు సార్లు, ఇక్కడ ఒక సారి గెలిచారు. టిడిపి నేత గోవిందప్ప ఇక్కడ నుండి మూడు సార్లు గెలిచారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి ఓడిన హనుమంతరాయ చౌదరి ఆ తరువాతి ఎన్నికల్లో టిడిపి నుండి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో రఘువీరా రెడ్డి పెనుగొండ నుండి పోటీ చేసి ఓడిపోయారు.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
కళ్యాణదుర్గం నియోకవర్గంలో ఇప్పటి వరకు మొత్తంగా 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి ఆరు సార్లు, జనతా, సిపిఐ ఒక్కోసారి, స్వతంత్ర అభ్యర్ది ఒకసారి గెలిచారు. కాంగ్రెస్ నేత, శాసనమండలి సభ్యురాలి గా ఉంటూ మరణించిన లక్ష్మీదేవి ఇక్కడి నుండి రెండు సార్లు ఎన్నికయ్యారు. ఆమె గతంలో మంత్రిగా పని చేసారు. లక్ష్మీ దేవి మరణం తరువాత ఆమె భర్త ఎమ్మెల్సీ అయ్యారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో కళ్యాణదుర్గంలో మొత్తం 195652 ఓట్లు ఉండగా, అందులో167171 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన హనుమంతరాయ చౌదరికి 91891 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన తిప్పేస్వామికి 69662 ఓట్లు వచ్చాయి. టిడి పి అభ్యర్ది హను మంతరాయ చౌదరి 22319 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications