పరిటాల శ్రీరామ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన గోరంట్ల మాధవ్ .. రీజన్ ఇదే
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగామారుతుంది. ప్రధాన పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక అన్ని జిల్లాలలోనూ అధికార , ప్రతిపక్ష పార్టీల నేతల ఫిర్యాదులు పెరిగిపోయాయి. ఎన్నికల నేపధ్యంలో బెదిరింపులకు దిగుతున్నారని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే అనంతపురం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో మొన్నటివరకు ఎంపీటీసి , జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు .ఇక నామినేషన్లు దాఖలు చెయ్యకుండా బెదిరించటాలు, దౌర్జన్యం చెయ్యటం వంటి ఘటనల నేపధ్యంలో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు. తాజాగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను పరిటాల శ్రీరామ్ బెదిరిస్తున్నారని ,అంతే కాక ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఏ మాత్రం సహించేది లేదని పేర్కొన్నారు .

రాప్తాడులో గెలవలేకే ప్రత్యర్ధులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ఇక రామగిరిలో పరిటాల శ్రీరామ్ అరాచకాలు గమనించాలని ఆయన కోరారు. పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు చెయ్యాలని పేర్కొన్నారు . ఇక గోరంట్ల మాధవ్ తో పాటు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా పరిటాల శ్రీరామ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఎంపీడీవో కాలర్‌ని టీడీపీ నేతలు పట్టుకున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే పరిటాల శ్రీరామ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు చెయ్యాలని వారు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్ళి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Recommended Video

-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications