పెళ్లి పేరుతో యువతికి వేధింపులు, ఆమె మేనత్తకు కూడా.. డేటింగ్ యాప్‌లో ఫోటో..
ప్రేమ, పెళ్లి పేరుతో ఆకతాయిల ఆగడాలు మించిపోతున్నాయి. యువతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిత్యం ఎదో ఒకచోట ఇలాంటి ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అయితే సదరు యువకుడు.. యువతీతోపాటు ఆమె మేనత్తను కూడా వదల్లేదు. ఆమె నెంబర్ పోర్న్ సైట్లలో పెట్టి మరీ హరాస్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆకతాయిని అరెస్ట్ చేశారు.

పేరంట్స్‌ను చంపుతానని..
ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురిచేసిన ఆకతాయి కటకటలా పాలయ్యాడు. పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రులను చంపుతానని బెదిరించిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన పాలకూరు నవీన్ లా రెండవ సంవత్సరం చదువుతున్నాడు. చదివేది లా.. అయిన చేసేవీ ఆకతాయి పనులే. టిక్ టాక్ మనుగడలో ఉన్న సమయంలో అందులో వీడియోలు చేసేవాడు. అలా చాలా మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి స్నేహం చేశాడు.

స్నేహం చేసి..
టిక్‌టాక్ ద్వారా చాలా మందికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించి.. అందులో యువతులు, మహిళలతో స్నేహం చేశాడు. తర్వాత తన అసలు బుద్దిని ప్రదర్శించాడు. ఎవరు నవీన్ పై ఫిర్యాదు చేసే దైర్యం చెయ్యలేదు. కానీ అతని పాపం పండింది. తాజాగా ఓ యువతిని ఆన్‌లైన్ వీడియో బ్లాగింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆ యువతి భరించి... భరించి, చివరికి పెద్దలకు విషయం తెలియజేసింది.

మేనత్తకు చెప్పగా.. ఆమెకు అశ్లీల వీడియోలు
సదరు యువతికి అశ్లీల వీడియోలను పంపేవాడు. రోజులు గడిచే కొద్దీ నవీన్ చేష్టలు ఎక్కువ అయ్యాయి. తనను పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. నవీన్ వేధింపులకు విసిగిపోయిన యువతి.. మేనత్తకు తెలిపింది. దీంతో ఆమె నవీన్‌ను మందలించింది. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మేనత్తను వేధింపులకు గురిచేయడం స్టార్ట్ చేశాడు. అసభ్య వీడియోలను పంపాడు.
Recommended Video

డేటింగ్ యాప్‌లో ఫోటో
డేటింగ్ యాప్స్‌లో ఆమె ఫోటో పెట్టి ఫోన్ నంబర్ ఇచ్చాడు.. దీంతో సదరు మహిళకు రోజు కాల్స్ వస్తుండటంతో ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేసి సాంకేతిక ఆధారాలను సేకరించాడు. నిందితుడు నవీన్‌ను అరెస్ట్ చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications