ఏపీలో స్ధానిక ఎన్నికలు కష్టమే-జగన్ ఎంతదూరమైనా వెళ్తారు- జేసీ షాకింగ్ కామెంట్స్
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం, వాటిని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి దీనిపై స్పందించారు. చాలా రోజుల తర్వాత జనంలోకి వచ్చిన ఆయన స్ధానిక సంస్ధల ఎన్నికలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మరోవైపు జగన్‌పైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఎన్నికల సంఘం గురించి ముందుగా జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సంఘం మాత్రమే ఎన్నికలను నిర్వహించలేదని, అందుకు ప్రభుత్వ సహకారం కూడా కావాలని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు సహకరించాలనే జేసీ తెలిపారు. అధికారులకు డబ్బు సమకూర్చాల్సింది ప్రభుత్వమేనని జేసీ అన్నారు. ఇలాంటి పరిస్దితుల్లో ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదన్నారు.

ఏపీలో స్ధానిక ఎన్నికల విషయంలో సీఎం జగన్ వైఖరిపైనా జేసీ దివాకర్‌రెడ్డి స్పందించారు. తాను అనుకున్న విధంగా స్ధానిక ఎన్నికల వాయిదా కోసం జగన్ ఎంత దూరమైనా వెళ్తారని జేసీ అన్నారు. ఎన్నికలు జరపకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందని జేసీ తెలిపారు. దీంతో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. స్ధానిక ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని ఈసీతో పాటు విపక్ష పార్టీలన్నీ కోరుకుంటున్న నేపథ్యంలో జేసీ కామెంట్స్ వారికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. అటు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో ఎంతదూరమైనా వెళ్తుందంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు కూడా అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
-
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications