Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజకీయాల్లో తండ్రి కొడుకుల చేతుల్లో ఓడిపోయిన నాయకుడెవరు- కేతిరెడ్డి ప్రశ్న

పుట్టపర్తి: శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ధర్మవరం శాసన సభ్యుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలుగుదేశంపై ఘాటు విమర్శలు చేశారు. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్‌గా చేసుకుని కీలక వ్యాఖ్యలు సంధించారు. ఇవే చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు సాగిస్తోన్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. చంద్రబాబు, నారా లోకేష్, టీడీపీ నాయకులు 2019లోనే చివరి ఎన్నికలను ఎదుర్కొన్నారని అన్నారు.

ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ సమీక్షను నిర్వహించారు. హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ సహా పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు, నారా లోకేష్‌కు ఇక మళ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాబోదనీ జోస్యం చెప్పారు.

 YSRCPs Dharmavaram MLA Kethireddy Venkatarami Reddy lashes out Chandrababu and Nara Lokesh

రాష్ట్ర రాజకీయాల్లో తండ్రీకొడుకుల చేతుల్లో చావుదెబ్బలు తిన్న నాయకుడు ఎవరని ఆయన వైసీపీ కార్యకర్తలను ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో రాజకీయంగా చంద్రబాబు చావుదెబ్బలు తిన్నారని ఎద్దేవా చేశారు. తండ్రీ కొడుకుల చేతుల్లో తన్నులు తిన్న ఏకైక నాయకుడిగా చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే చిరస్థాయిగా నిలిచిపోతారని చురకలు అంటించారు.

2004, 2009లో తండ్రి వైఎస్సార్ చేతిలో, 2019లో వైఎస్ జగన్ చేతిలో తన్నులు తిన్నాడని గుర్తు చేశారు కేతిరెడ్డి. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మవొడి, విద్యాదీవెన, నాడు-నేడు, వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థలను రద్దు చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇవ్వగలడా? అని ప్రశ్నించారాయన. తానూ వాటిని అమలు చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడని, ఎవరైనా సరే జగన్‌ను అనుసరించాల్సిందేనని చెప్పారు.

వైఎస్ జగన్ పరిపాలనలో ఎలాంటి లోపాలు, తప్పులు లేవని, వాటి కోసం టీడీపీ నాయకులు అనుక్షణం అన్వేషిస్తూనే ఉన్నారని కేతిరెడ్డి అన్నారు. ఒక్క తప్పు కూడా లేకపోవడం వల్లే టీడీపీ గానీ, ఆ పార్టీకి అనుకూలంగా ఉంటోన్న మీడియా గానీ లేని పోని ఆరోపణలను ప్రభుత్వం గుప్పిస్తోందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ 2019లోనే తన చివరి ఎన్నికలను ఎదుర్కొందని, ఇకపై ఆ పార్టీ గెలిచే ప్రసక్తే లేదని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+