వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఒక్కరోజే 351 మందికి పాజిటివ్ .. గ్రామాలకూ పాకుతున్న కరోనా.. ఏడు వేలకు పైగా కేసులు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఏపీ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఈరోజు ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఏకంగా 351 నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతోంది అర్థం చేసుకోవచ్చు.

 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా టెన్షన్ .. జాగ్రత్త సార్లూ, అవగాహన కావాల్సింది మీకే : నెటిజన్ల సెటైర్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా టెన్షన్ .. జాగ్రత్త సార్లూ, అవగాహన కావాల్సింది మీకే : నెటిజన్ల సెటైర్లు

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నమోదైన 351 కేసులలో 275 మందికి రాష్ట్రానికి సంబంధించిన వారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 51 మందికి, విదేశాల నుండి వచ్చిన వారిలో 23 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇక కర్నూలు జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో మరొకరు కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా ఏపీలో పరీక్షల విషయానికి వస్తే 15118 శాంపిల్స్ ను పరీక్షించగా వారిలో 351 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది.

 7071కి చేరిన కేసుల సంఖ్య.. సచివాలయ వాలంటీర్లు బాధితులే

7071కి చేరిన కేసుల సంఖ్య.. సచివాలయ వాలంటీర్లు బాధితులే

ఇప్పటి వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7071 కి చేరింది. ఇప్పటిదాకా 90 మంది కరోనా కారణంగా ఏపీలో మృత్యువాత పడ్డారు. ఏపీలోని వివిధ నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామాల వరకు కూడా కరోనా వ్యాప్తి జరుగుతోంది. ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేట లో ఇద్దరు సచివాలయ వాలంటీర్లకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం మండపేట లో ముగ్గురికి వాలంటీర్లకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇక పి.గన్నవరం మండలం ఆర్ ఏనుగు పల్లిలో కూడా కొత్తగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటికే ఆ గ్రామంలో ఏడు కరోనా కేసులు నమోదైనట్లు గా తెలుస్తోంది.

Recommended Video

Sushant Singh Rajput's Fan ఆత్మహత్య, సూసైడ్ నోట్ లో ఏం రాసాడో తెలుసా ?
పాలకుల నిర్లక్ష్యమే కారణం అని ప్రతిపక్షాల ఆగ్రహం

పాలకుల నిర్లక్ష్యమే కారణం అని ప్రతిపక్షాల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఈ విధంగా ఉంటే, కరోనా కరాళ నృత్యం చేస్తుంటే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే సాక్షాత్తు పాలకులు కరోనా వ్యాప్తికి నేపథ్యంలో ముఖానికి మాస్క్ లు కానీ, తీసుకోవలసిన జాగ్రత్తలు గానీ తీసుకోవడం లేదని, ఏం సందేశం ఇస్తున్నారని, ప్రజలకు ఏం చెప్తారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించిన విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అని పలువురు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది.

English summary
Coronavirus cases in Andhra Pradesh are increasing day by day. According to the latest bulletin issued by the AP Medical Health Department, 351 new cases were registered in Andhra Pradesh, of which 275 were from AP. The total number of corona cases in the AP increased to 7071.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X