• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

70 రోజుల్లోనే 98 మంది రైతుల ఆత్మహత్య ... ఇదేనా జగన్ పాలన అన్న మాజీ మంత్రి

|

ఏపీలో వైసీపీ సర్కారు పాలనపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు అభివృద్ధి శూన్యం అని ఆయన విమర్శించారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నామన్న పేరుతో కూల్చివేతలు, టెండర్ల రద్దులు తప్ప జగన్ సర్కార్ చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. అయితే జగన్ 70 రోజుల పాలనలో ఎవరికి ఏమి ఒరిగింది లేదన్న మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని పేర్కొన్నారు.

జగన్ ఎక్కడా తగ్గట్లేదు :ఇక టార్గెట్ లోకేశ్: పంచాయితీ రాజ్ పనులు నిలిపివేత..!

 పరిశ్రమలు, ప్రాజెక్టులను ఆపడానికి మాత్రమే వైసీపీ పని చేస్తుందన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

పరిశ్రమలు, ప్రాజెక్టులను ఆపడానికి మాత్రమే వైసీపీ పని చేస్తుందన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి హయాంలో వచ్చిన పరిశ్రమలు, ప్రాజెక్టులను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంచి నేత ఉన్నప్పుడే మంచి పరిపాలన కొనసాగుతోందని ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి అని అభివృద్ధి పథకాలు మాత్రం ఆపడం సరికాదని ఆయన మండిపడ్డారు. అంతేకాదు సీఎం జగన్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారాయని పేర్కొన్నారు మాజీ మంత్రి. జగన్ నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు.

 వైసీపీ పాలనలో 98 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడిన కాల్వ శ్రీనివాసులు

వైసీపీ పాలనలో 98 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడిన కాల్వ శ్రీనివాసులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దాదాపుగా 98 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు రైతులకు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వకపోవడం వల్ల అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఈ 70 రోజులలోనే 98 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన జగన్ పై రైతుల్లో నమ్మకం పూర్తిగా సన్నగిల్లిపోయిందని పేర్కొన్న కాల్వ శ్రీనివాసులు అన్నదాతల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు.

 70 రోజుల జగన్ పాలనలో చేసిందేమీ లేదని తేల్చేసిన మాజీ మంత్రి

70 రోజుల జగన్ పాలనలో చేసిందేమీ లేదని తేల్చేసిన మాజీ మంత్రి

జగన్ సర్కార్ రైతులకు అండగా ఉండాల్సింది పోయి రుణ ఉపశమన పథకం నాలుగు, ఐదు విడతల చెల్లింపులను నిలిపివేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు . రైతులను ఉద్ధరిస్తామని చెప్పి రైతుభరోసా పథకం తీసుకొచ్చారని, తొలుత రూ.12,500 ఇస్తామన్నారు. ఆ తర్వాత కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామనడం శోచనీయమని కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని ఆయన విమర్శలు గుప్పించారు. మొత్తానికి 70 రోజుల జగన్ పాలనలో చేసిందేమీ లేదని కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former minister Calva Srinivasas has been said that Jagan government is trying to stop the industries and projects coming under the TDP regime since the YCP came to power. He was angry that good governance was going on while there was a good leader and that there is no such thing at present. He stressed that it is not right to stop development schemes . Almost 98 farmers have been accused of committing suicide since the YCP came to power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more