వ్యభిచారకూపం నుంచి బయటపడ్డ చిన్నారి: అరెస్ట్

A inter student missing in Hyderabad
వరంగల్/హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలోని ఓ వ్యభిచార గృహం నుంచి 12 ఏళ్ల బాలిక బయటపడింది. వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యుల కన్నుకప్పి తప్పించుకున్న ఆ బాలిక భూపాలపల్లి పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఇచ్చిన సమాచారంతో ఆ వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు, నిందితులను అరెస్ట్ చేశారు. తమ లాంటి చిన్నారులను బలవంతంగా అపహరించిన నిందితులు, వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని బాధితులు ఆరోపించారు.

ఇంటర్ విద్యార్థి అదృశ్యం

హైదరాబాద్: నగరంలోని కెపిహెచ్‌బి కాలనీలో ఇంటర్మీడియట్ చదువుతున్న మహేష్ అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న మహేష్, జనవరి నెల 31 నుంచే కనిపించడం లేదు.

అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ విషయంపై అతడి తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మహేష్ స్నేహితుల ద్వారా సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు పది రోజుల నుంచి కళాశాలలో లేకుండా ఉంటే తమకు సమాచారం ఇవ్వకపోవడంపై కాలేజీ యాజమాన్యంపై మహేష్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+