డబ్బుల కోసం మహిళపై కిరాతకం, నోట్లో గుడ్డలు కుక్కి, సున్నిత ప్రదేశాల్లో ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూల్: యాభై వేల రూపాయాల కోసం ఓ వివాహితను చిత్రహింసలకు గురిచేశారు. మహిళ అని కూడ చూడకుండా సున్నిత భాగాల్లో తీవ్రంగా గాయపర్చారు.తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గానికి చెందిన హలహర్వి మండలానికి చెందిన వివాహితకు ఆమె తల్లి 20 రోజుల క్రితం బంగారం కొనుగోలుకు గాను రూ.50 వేలను ఇచ్చారు. ఆమె ఈ డబ్బును ఇంట్లోని బీరువాలో దాచారు.

a lady harassement for money in kurnool district

వీరిది ఉమ్మడి కుటుంబం .బీరువాలో దాచిన రూ.50 వేల రూపాయాలలో రూ.45 వేలు కన్పించలేదు.దీంతో ఆమె ఇంట్లో అత్త, మామలకు చెప్పింది. ఈ డబ్బును ఇంట్లోని వారే తీశారని గుర్తించిన వివాహిత విషయాన్ని మరోసారి అత్త,మామాలకు సమాచారం ఇచ్చింది.

ఇదే సమయంలో అయితే ఈ నగదును తాను తీసిన విషయాన్ని ఒప్పుకొన్నారు.ఈ నగదును ఈరమ్మ అనే తమ దగ్గరి బంధువుకు ఇచ్చినట్టు ఆమె వెల్లడించింది.అయితే ఈ విషయమై ఈరమ్మ ఆమె భర్త రంగన్నను పిలిపించి పంచాయితీ నిర్వహించారు.

అయితే తమకు ఎవరూ కూడ డబ్బులు ఇవ్వలేదని ఈరమ్మ, రంగన్న చెప్పారు.తాము డబ్బులు తీసుకోలేదని దేవుడి గుడిలో కూడ ఈరమ్మ, రంగన్న ప్రమాణం చేశారు.

దీంతో ఈరమ్మ, రంగన్న ఆ కుటుంబంపై కక్ష పెంచుకొన్నారు. శుక్రవారం అర్థరాత్రి మూత్ర విసర్జన కోసం ఇంటి నుండి బయటకు వచ్చిన వివాహితను ఈరమ్మ, రంగన్న మరో వ్యక్తి కలిసి తీవ్రంగా గాయపర్చారు.

నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా దాడి చేశారు. బాధితురాలి జననాంగాలను తీవ్రంగా గాయపర్చారు,.రక్తస్రావంతో ఆమె బాధపడుతోంటే కేకలు విని నిందితులు పారిపోయారు.

బాధితురాలిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఆదోని డిఎస్ పి కొల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం కర్నూల్ ఆసుపత్రికి తరలిస్తామని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a lady harassement for money in kurnool district.severely injured lady shifted to hospital for treatment. police registered a case.
Please Wait while comments are loading...