ప్రియురాలు అలిగింది.. రైలు ఆగింది: టెక్కలి యువకుడి ఘనకార్యం!

సమాజంలో యువత పైన రోజు రోజుకి సినిమాల ప్రభావం ఎక్కువ అవుతుంది. సినీ ఫక్కీ లో ప్రేమించిన యువతి కోసం శ్రీకాకుళం జిల్లా టెక్కలి కి చెందిన ఒక యువకుడు చేసిన పని తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకంగా ఒక రైలుని ఆగేలా చేసింది. ఈ షాకింగ్ ఘటన వివరాలలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలానికి చెందిన యువకుడు, పార్వతీపురం కు చెందిన యువతి ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుకున్నారు.

ప్రియురాలి కోసం ప్రియుడు చేసిన పని

ఈ సమయంలో ఆ యువతి, యువకులు ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే తాజాగా నిన్న యువతిని చూడాలని భావించిన యువకుడు, టెక్కలిలో తనకు ప్రమాదం జరిగిందని ఆమెకు అబద్ధం చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన ఆమె నిజంగానే ప్రమాదం జరిగి గాయాలపాలు అయ్యాడని నమ్మి, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా టెక్కలి కి చేరుకుంది. అయితే అక్కడ అటువంటి ప్రమాదం ఏమీలేదని, ప్రియుడు చెప్పింది అబద్ధమని తెలుసుకున్న యువతి తీవ్ర ఆగ్రహానికి లోనైంది.

a lover stopped train by trying to commit suicide for girl friend as she is upset and tried to leave him

రైలు పట్టాలపైన తలపెట్టి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు

అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆమెను ఆపాలని ప్రయత్నించిన యువకుడు ఊహించని పనిచేశాడు. ఆమె అలిగిందని గుర్తించి, ఆమె అలక తీర్చడం కోసం, తనను వదిలి వెళ్ళొద్దని చెప్పడం కోసం ఆమె కోసం రైలు పట్టాల పైన తలపెట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇక యువకుడు పట్టాల పైన ఉన్నప్పుడే గుణుపూర్ వెళ్లే ప్యాసింజర్ రైలు దగ్గరకు వచ్చింది.

ప్రియుడు చేసిన పనికి నిలిచిన రైలు

దీంతో అక్కడున్న వారు గమనించి తక్షణం రైలును నిలిపివేశారు. రైలు నిలిచిపోవడంతో వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు యువకుడిని పక్కకు లాగి ఇద్దరినీ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకొని వారి తల్లిదండ్రులను పిలిపించి భవిష్యత్తులో ఇటువంటి పనులు చేయవద్దని హెచ్చరించి, కౌన్సిలింగ్ ఇచ్చి మరీ పంపించారు. ఇక ప్రేమ కోసం యువకుడు చేసిన పని కొద్దిసేపు ఒక రైలును నిలిచిపోయేలా చేయగా, దీని కారణంగా కొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+