భయపెడుతోన్న తుఫాన్ గండం, భారీ వర్షాలు- ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!!

ఏపీని మరో తుఫాన్ గండం భయపెడుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతం, ఆను కుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరా వతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తదుపరి 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో, రానున్న నాలుగు రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాల పై అప్రమత్తం చేసింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. కాగా, అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజుల నుంచి కడపలో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. తుపాన్​ కొద్ది రోజులు ఉందని అధికారులు వెల్లడించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్ర మత్తం చేశారు. ఈ వాయుగుండం ప్రభావంతో చలి తీవ్రత తగ్గింది.

a-low-pressure-system-over-the-strait-of-malacca-is-poised-to-intensify-into-a-cyclonic-storm-in-th

కాగా, 27వ తేదీకల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడనుంది. సముద్రంలోనే బల హీనపడుతుందని కొందరు నిపుణులు చెబుతుండగా, మరికొన్ని మోడళ్ల మేరకు దిశ మార్చుకుని బంగ్లాదేశ్‌ వైపు వెళ్తుందని అంచనావేశారు. ఇదిలావుండగా శ్రీలంక సమీప కామరూన్‌, నైరుతి బంగాళాఖాతంలో ఈ రోజు (సోమవారం) మరో అల్పపీడనం ఏర్పనుంది. దీని ప్రభావంతో కోస్తా ప్రాంతంలో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోనూ హైదరాబాద్ తో సహా పాలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. మొంథా తుఫాను తీవ్రత నుంచ ఇంకా పూర్తిగా కోలుకోకముందే తాజా తుఫాను హెచ్చరికలు రైతంతాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం తుఫాను గమనం పైన అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. రాష్ట్రం పై ప్రభావం ఉంటుందా లేదా అనేది స్పష్టత రాగానే చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+