ప్రేమను నిరూపించుకోవడానికి ఇలానా? : ఎంత పనిచేసింది?
పశ్చిమగోదావరి : 'నిజంగా నాపై అంత ప్రేమ ఉందా..? ఉంటే నిరూపించు..?' సాధారణంగా ఇలాంటి డైలాగ్స్ అన్నీ సినిమాల్లోనే కనిపిస్తాయి. అయితే అదే సీన్ ను రియల్ లైఫ్ కు అనువదిస్తే అచ్చు ఈ ఘటనలాగే ఉంటుందేమో! ప్రేమను నిరూపించుకోవాలంటూ ప్రియుడు చేసిన సవాల్ ను స్వీకరిస్తూ.. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ అమ్మాయి కెనాల్ లో దూకేసింది.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. దివ్య, నాగేంద్ర అనే ఇద్దరు వరుసకు బావ-మరదళ్లు. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. ఇదే క్రమంలో సోమవారం నాడు నిడదవోలులోని ఓ పంటకాలువ పైనుంచి నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరి మధ్య ప్రేమ విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది.

దీంతో.. నిజంగా తనపై ప్రేమ ఉంటే ఈ పంట కాలువలోకి దూకి ప్రేమను నిరూపించుకోవాలని సవాల్ విసిరాడు నాగేంద్ర. నాగేంద్ర మాటలను సీరియస్ గా తీసుకున్న దివ్య నిజంగానే పంట కాలువలో దూకేసింది. అయితే అటుగా వెళ్తున్న భవానీ భక్తులు యువతి కెనాల్ లో దూకడం గమనించి ఆమెను రక్షించారు. అనంతరం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.












Click it and Unblock the Notifications