అభిమాని చెంప చెళ్లుపై షాక్: 'బాలకృష్ణ చేయి తగిలితే పులకరింత, తాకితే పుణ్యం'

హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ఓ కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది. దీనిని టిడిపి సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

నంద్యాల: హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ఓ కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది. అయితే, దీనిని టిడిపి సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

చదవండి: మీసం మెలేసి.. నేరుగా జగన్‌ను టార్గెట్ చేసిన బాలకృష్ణ, వాహనం కదలని స్థితి

బాలకృష్ణ చేసిన దాంట్లో తప్పేముందని

బాలకృష్ణ చేసిన దాంట్లో తప్పేముందని

ఈ ఘటనను ఖండించాల్సిన టిడిపి... అసలు బాలకృష్ణ చేయి తాకడమే పుణ్యం చేసుకున్నట్లు అంటూ వ్యాఖ్యలు చేసిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అసహనంతో అభిమానిపై బాలకృష్ణ చేయిచేసుకుంటే అందులో తప్పేముందని టిడిపి నేతలు అంటున్నారని చెబుతున్నారు.

బాలకృష్ణ చేయి తగిలితేనే ఆ పులకరింత అంటూ

బాలకృష్ణ చేయి తగిలితేనే ఆ పులకరింత అంటూ

బాలకృష్ణ చేయి తగిలితే ఆ పులకరింతే వేరు అని టిడిపి నేతలు చెబుతున్నారని పేర్కొంటోంది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన బాలకృష్ణ రాత్రి బస కోసం పట్టణంలోని ఓ లాడ్జి వద్దకు వచ్చారు.

ఆన్ లైన్లో వీడియో

ఆన్ లైన్లో వీడియో

ఆ సమయంలో తన అభిమాన హీరోకు దండవేసి ఫొటో దిగాలని ఓ టిడిపి కార్యకర్త ఉత్సాహంగా బాలయ్య వద్దకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆయన ఒక్కసారిగా ఆ కార్యకర్తపై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన తీరు చూసి అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు ఆన్‌లైన్‌లో పెట్టారు.

సోమిశెట్టి వింత సమర్థన

సోమిశెట్టి వింత సమర్థన

అయితే పార్టీ కార్యకర్తను బాలకృష్ణ కొట్టడాన్ని కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సమర్థించారని అంటున్నారు. అంతేకాదు, బాలకృష్ణ కొడితే ఆ అభిమాని పొంగిపోయి ఉంటాడని, ఆయన చేయి తాకడం అంటే పుణ్యం చేసుకున్నట్లు అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేయి చేసుకోవడమా?

ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేయి చేసుకోవడమా?

ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి, అభిమానిపై చేయి చేసుకునే హక్కు బాలకృష్ణకు ఎవరిచ్చారని, ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించే తీరు ఇలాగేనా? అని పలువురు విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+