ఏపీలో బిజెపి ఉండొద్దు, తెగతెంపులు చేసుకోవాలని టిడిపికి హితవు: సినీ నటుడు శివాజీ
అమరావతి: సినీ నటుడు శివాజీ బిజెపిపై నిప్పులు చెరిగారు.ఏపీ రాష్ట్రంలో బిజెపి అనే పదం విన్పించకూడదని శివాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హమీని బిజెపి తుంగలో తొక్కిందని విమర్శించారు. టిడిపి బిజెపితో తెగతెంపులు చేసుకొని ప్రధానమంత్రిపై పోరాటం చేయాలని శివాజీ సూచించారు.
2014 ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని బిజెపి, హమీ ఇచ్చింది.అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ఈ హమీని విస్మరించింది.ఈ హమీని విస్మరించడంపై బిజెపిపై సినీ నటుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని బిజెపి నేతలను కోరారు శివాజీ. ప్రత్కేక హోదాను ఇస్తే ఏపీ ప్రజలు బిజెపి వెంట నిలుస్తారని శివాజీ అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉన్న విషయాన్ని శివాజీ గుర్తు చేశారు. ఈ ఏడాదైనా ప్రజాప్రతినిధులు ప్రత్యేక హోదా గురించి పోరాటం చేయాలని సూచించారు.

ఏపీలో బిజెపి అనే పదం విన్పించకూడదు
ఏపీ రాష్ట్రంలో బిజెపి అనే పదం విన్పించకూడదని సినీ నటుడు శివాజీ అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి ఇచ్చిన హమీని నెరవేర్చుకోలేదని శివాజీ విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హమీలను నెరవేర్చని బిజెపి అనే పదం విన్పించకూడదని శివాజీ చెప్పారు.
Recommended Video


ప్రత్యక హోదా ఇస్తే బిజెపిదే అధికారం
ప్రత్యేక హోదా ఏపీ రాష్ట్రంలో ప్రజలు బిజెపికి అనుకూలంగా తీర్పును ఇస్తారని సినీ నటుడు శివాజీ అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజలు ఏం అన్యాయం చేశారని శివాజీ బిజెపి నేతలను ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని సినీ నటుడు శివాజీ బిజెపి నేతలను కోరారు.

అవమానిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీని అన్ని రకాలుగా అవమానపరుస్తున్నారని సినీ నటుడు శివాజీ అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రం ఎవరీకీ కూడ పోటీ కాదంటున్నారని శివాజీ ఆవేదన చెందారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమను అవమానపరుస్తుంటే తట్టుకోలేకపోతున్నామని శివాజీ చెప్పారు.

బిజెపితో తెగతెంపులు చేసుకోవాలి
బిజెపితో తెగతెంపులు చేసుకోవాలని టిడిపిని సూచించారు సినీ నటుడు శివాజీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోరాటం చేయాలని టిడిపి నేతలకు శివాజీ సూచించారు. ఈ ఒక్క ఏడాదైనా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఏపీ నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులను కోరారు సినీ నటుడు శివాజీ.












Click it and Unblock the Notifications