ఎవరెవరిని ఫాలో అవుతున్నారు ? జగన్ కోపం వెనుక అసలు కారణం !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే టీడీపీకి, దానికి మద్దతుగా నిలిచే ఓ వర్గం మీడియాపై వైఎస్ జగన్ తో పాటు వైసీపీలోనూ ఓ రకమైన వ్యతిరేకత ఉండేది. దాన్ని తనకు అనుకూలంగా మల్చుకునేందుకు ఆరంభంలో ప్రయత్నాలు చేసిన జగన్, ఆ తర్వాత మాత్రం వదిలేశారు. చివరికి 2019 ఎన్నికల్లో వైసీపీ సాధించిన గెలుపు తర్వాత ఇక మీడియా ఎలా ఉన్నా తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని జగన్ ఫిక్స్ అయిపోయారు. తన పార్టీ నేతలకు కూడా అంతర్గత సమావేశాల్లో అదే చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్దితి తారుమారవుతోంది.

జగన్ వర్సెస్ మీడియా
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ వర్గం మీడియా, ఇంకా చెప్పాలంటే ప్రధాన స్రవంతి మీడియా మొత్తం పనిచేస్తుందన్న భావన సీఎం జగన్ కు ఎప్పటి నుంచో ఉంది. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చాక మీడియాను లైట్ తీసుకున్నారు. కానీ మీడియా మాత్రం జగన్ ను లైట్ తీసుకోలేదు. అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి మరీ జగన్ విషయంలో తన వైఖరి కొనసాగించింది. అయితే ప్రధాన విపక్షం టీడీపీకి అనుకూలంగా, జగన్ కు వ్యతిరేకంగా తయారైన ఓ వర్గం మీడియా అడుగడుగునా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో పరిస్ధితి పూర్తిగా మారిపోయింది.

టీడీపీని నడిపించే స్ధాయికి..
రాష్ట్రంలో ఈ మూడున్నరేళ్లలో చోటు చేసుకున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తే ప్రధానంగా ఓ వర్గం మీడియా టీడీపీని నడిపించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా కొన్ని పత్రికలు, ఛానళ్లలో వస్తున్న వార్తల్ని ఆధారంగా చేసుకుని ప్రెస్ మీట్లు పెట్టడం, వాటినే సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో విపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేయాలనుకుంటే అందుకు తగిన హోమ్ వర్క్ చేసేవి. వాటి ఆధారంగా బయట అయినా, అసెంబ్లీలో అయినా ఓ ప్లాన్ ప్రకారం విమర్శలు చేసేవి. వాటిపై వివరణ ఇచ్చేందుకు సైతం ప్రభుత్వం ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు విపక్షాలు ఓ వ్యూహం లేకుండా మీడియా వార్తలతో విమర్శలకు దిగుతుండటంతో వాటికి పస లేకుండా పోతోంది. వాటిని అధికార వైసీపీ కూడా అంతే సులువుగా తిప్పికొడుతోంది.

విపక్షాల్ని మించి విమర్శలు
రాష్ట్రంలో తాజాగా పత్రికల్ని, టీవీ ఛానళ్లను పరిశీలిస్తే అధికార పార్టీపై చేస్తున్న విమర్శలు హద్దులు మీరిపోతున్నాయి. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నిత్యం కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలన్న లక్ష్యం కనిపిస్తోంది. గతంలో ఏదైనా ఘటన జరిగితే వాటి ఆధారంగా వార్తలు ప్రచురించే, ప్రసారం చేసేవారు. కానీ ఇప్పుడు విమర్శించడం కోసమే వార్తల్ని వండి వార్చేస్తున్నారు.దీంతోపాటు విపక్షాలను మించి ఓ వర్గం మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో జనానికి కూడా ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా రాస్తున్నవే, ప్రచారం చేస్తున్నవే అన్న భావన కలుగుతోంది. ముఖ్యంగా విపక్షాలను మించి మీడియా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా రాజకీయ పార్టీల్ని డమ్మీలుగా మార్చేస్తున్నారన్న ఫీలింగ్ కలిగిస్తోంది.

జగన్ కోపం అందుకే ?
రాష్ట్రంలో విపక్షాలు వైసీపీని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తే వాటిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ విపక్షాలను మించి మీడియా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటుండంతో సీఎం జగన్ కూడా దీనిపై తీవ్ర ఆగ్రహంగా కనిపిస్తున్నారు. బహిరంగసభల్లో సదరు మీడియా సంస్ధల్ని, వాటి అధినేతల్ని పేర్లు పెట్టి ప్రస్తావిస్తూ మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. అదే విపక్ష పార్టీలు ముందుండి రాజకీయాలు చేస్తూ, మీడియా ఓ పరిధి మేరకు వాటికి మద్దతిస్తుంటే జగన్ వర్సెస్ మీడియా వార్ ఈ స్దాయికి చేరేది కాదన్న చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. జనం కూడా జగన్ పై మీడియా చేసే విమర్శల్ని లైట్ తీసుకునే స్దాయికి చేరిపోతున్నారు. ఇది అంతిమంగా తిరిగి జగన్ కే పాజిటివ్ గా మారుతోంది.
-
YS Jagan: బెంగళూరు నుంచి మకాం మార్చబోతున్న జగన్ ? కూటమికి కౌంటర్ ప్లాన్..! -
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?











Click it and Unblock the Notifications