కోటంరెడ్డి సవాల్ స్వీకరించిన ఆదాల.. ! రూరల్ లోనే పోటీ చేస్తా.. నీ గుట్టు విప్పుతా..
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి విసిరిన సవాల్ ను ఆయన స్వీకరించారు.
ఏపీలో నెల్లూరు వైసీపీ రాజకీయం కాకరేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో వైసీపీపో పోరు ప్రారంభించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తెరపైకి వచ్చిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్ధానికంగా పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో కోటంరెడ్డి ఆయన్ను టార్గెట్ చేశారు. ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన కోటంరెడ్డి ఆదాలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఆయనకో సవాల్ విసిరారు.
ప్రతీ ఎన్నికలకూ పార్టీ మారే అలవాటు ఉందంటూ ఆదాలను టార్గెట్ చేసిన కోటంరెడ్డి.. ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరఫునే పోటీ చేస్తానని ప్రకటిస్తే ఆయనపై విమర్శలు చేయబోనని హామీ ఇచ్చారు. దీనిపై ఆదాల స్పందించారు. కోటంరెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటికే నియోజకవర్గంలో పావులు కదుపుతున్న ఆదాల.. కోటంరెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు మీడియా ముందుకొచ్చారు. అంతే కాదు కోటంరెడ్డి విసిరిసిన సవాల్ స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.

మూడున్నరేళ్లుగా నెల్లూరు రూరల్ లో అరాచకాలు చేశారంటూ కోటంరెడ్డిపై ఆదాల విమర్శలు ఎక్కుపెట్టారు. అలాగే కోటంరెడ్డికి డబ్బు పిచ్చి ఎక్కువైందని, త్వరలోనే ఆయన గుట్టు ప్రజల్లో విప్పుతానంటూ ఆదాల వెల్లడించారు. గత ఎన్నికల్లో కోటంరెడ్డి నియోజకవర్గంలో ఆయన కంటే తనకే 5 వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయన్నారు. అంతే కాదు పోరాటాల నుంచి వచ్చిన కోటంరెడ్డి ప్రజల్ని వేధిస్తున్నారని, కానీ కాంట్రాక్టర్ గా వచ్చిన తాను ప్రజా సేవ చేస్తున్నట్లు ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications