Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోజా! తండ్రి లాంటి బాబుపై నీచపు వ్యాఖ్యలా?: కామెడీ షోలకేనంటూ ఆది నిప్పులు

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై రోజా చేస్తున్న అభియోగాలు సరికాదని మంత్రి అన్నారు.

ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాబు ఇక జైలుకెళ్లడం ఖాయమేనని అన్నారు. బాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని ఆరోపించారు.

 సీబీఐని నమ్ముతారా?

సీబీఐని నమ్ముతారా?

ఈ నేపథ్యంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి.. రోజాపై మండిపడ్డారు. ఒకవైపు సీబీఐని తప్పు పడుతున్న వైకాంగ్రెస్ పార్టీ నేతలు... చంద్రబాబుపై అదే సంస్థతో విచారణ జరపాలంటూ ఎలా డిమాండ్‌ చేస్తారని ప్రశ్నించారు. అసలు వారు సీబీఐని మీరు నమ్ముతారా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలన్నారు.

తండ్రి లాంటి బాబుపై రోజా నీచం..

తండ్రి లాంటి బాబుపై రోజా నీచం..

తండ్రి సమానమైన వ్యక్తిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని రోజాకు మంత్రి ఆదినారాయణ రెడ్డి హితవు పలికారు. రాజకీయాల్లో జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు నడవవని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. రోజా రాజకీయాలు వదిలి సినిమాలు, సీరియళ్లకు పరిమితం కావాలని మంత్రి సలహా ఇచ్చారు.

జగన్ జైలుకెళ్లడం ఖాయం

జగన్ జైలుకెళ్లడం ఖాయం

ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి(చంద్రబాబు)పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆదినారాయణ రెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని.. త్వరలో ఆయన జైలుకెళ్లడం ఖాయమని అన్నారు.

 రోజా ఏమన్నారంటే..

రోజా ఏమన్నారంటే..

కాగా, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమని రోజా వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఈ కేసు విచారణ వేగంగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఓటుకు నోట్లు ఇచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబును శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ‘బ్రీఫ్డ్‌' అన్న వాయిస్‌ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్థారించిందని, ఈ ఆధారాలు బట్టి బాబును అరెస్ట్‌ చేయాలని కోరారు.

‘పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలను చంద్రబాబు కులదోసేస్తాం అంటే ఊరుకుంటారా? ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన పాపాలు పండేరోజు దగ్గరలోనే ఉంది. బీజేపీతో లాలుచి పడింది చంద్రబాబే. బ్రీఫ్డ్ మీ అంత బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడేవారు ఈ ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరొకరు ఉండరని కేటీఆర్‌ అప్పుడే చెప్పారు' అని ఎమ్మెల్యే రోజా అన్నారు. తన ప్రియ శిశ్యుడు రేవంత్ రెడ్డిని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని, ఇక రేపో మాపో కాంగ్రెస్ అవసరం వస్తే ఉపయోగకరంగా ఉంటుందనే అలా చేశారని ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+