ఒంటిమిట్టలోనూ వైసీపీ చిత్తు..! టీడీపీకి మరో భారీ విజయం..!

ఏపీలోని ఉమ్మడి కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్ధానాలకు జరిగిన ఉపఎన్నికల్లోనూ విపక్ష వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఉదయం వెలువడిన కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ స్ధానం ఫలితాల్లో టీడీపీ అభ్యర్ధి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ఓట్లకు పైగా తేడాతో ఘన విజయం సాధించగా.. ఒంటిమిట్టలోనూ అదే ఫలితం రిపీట్ అయింది. ఇక్కడా టీడీపీ అభ్యర్ధి ముద్దు కృష్ణారెడ్డి 6154 ఓట్ల భారీ తేడాతో వైసీపీ అభ్యర్ధి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని చిత్తు చేశారు.

ఒంటిమిట్ట జడ్పీటీసీ స్ధానానికి మొన్న జరిగిన ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్ధి ముద్దు కృష్ణారెడ్డికి 12505 ఓట్లు రాగా... వైసీపీ అభ్యర్ధి ఇరగం సుబ్బారెడ్డికి 6351 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్ధి ముద్దు కృష్ణారెడ్డి 6267 ఓట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసుకున్నారు. దీంతో ఉమ్మడి కడప జిల్లాలోని రెండు జడ్పీటీసీ ఉపఎన్నికల్లోనూ వైసీపీకి ఘోర పరాజయాలు ఎదురైనట్లయింది. ఈ రెండు ఫలితాలతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

after pulivendula tdp setback to ysrcp in vontimitta zptc bypoll also by 6267 votes

25 వేల ఓట్లకు పైగా ఉన్న రాజంపేట జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ స్ధానం ఉపఎన్నికను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే పులివెందులతో పోలిస్తే ఒంటిమిట్టలో స్థానిక నేత అయిన ఇరగం సుబ్బారెడ్డి పోటీ వైసీపీకి కాస్త పరువు కాపాడింది. పులివెందుల జడ్పీ ఉపఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ.. ఒంటిమిట్టలో మాత్రం మెరుగ్గా ఓట్లు తెచ్చుకుని పరువు కాపాడుకుంది.తద్వారా పులివెందుల కంటే ఒంటిమిట్టలో ఓటమే ఇప్పుడు వైసీపీకి కాస్త ఊరటనిచ్చేలా ఉంది.

మరోవైపు పులివెందుల తరహాలోనే ఒంటిమిట్ట ఉప ఎన్నికల పోలింగ్ లోనూ వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు, పోలింగ్ బూత్ లలోకి ఓటర్లు రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగాయి. దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించినా, ఈసీని ఆశ్రయించినా ఊరట మాత్రం దక్కలేదు. ఈ లోపు ఎన్నికల పోలింగ్ పూర్తి కావడం, ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు ప్రకటించడం కూడా పూర్తయిపోయింది. దీంతో ఈ ఫలితాలపై వైసీపీ న్యాయపోరాటం ఎలా ఉండబోతోందన్నది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+