• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోడెలపై మరోమారు విజయసాయి ఫైర్ .. కే ట్యాక్స్ పుట్ట బద్దలు . ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు పెట్టాలి

|
  కోడెల ట్యాక్స్ పై విజయసాయి ఫైర్ || Oneindia Telugu

  వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీ నేత, స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల కోడెలపై ట్విట్టర్ వేదికగా మండిపడిన విజయసాయి స్పీకర్ పదవికి ఆయన కళంకం తెచ్చారని పేర్కొన్నారు . ప్రజాధనాన్ని విచ్చలవిడిగా లూటీ చేశారని విజయసాయి ఆరోపించారు.ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించి కోడెల స్పీకర్ పదవికే చేటు చేశారని ఆయన పేర్కొన్నారు . అద్దె పేరుతో నాలుగున్నర కోట్ల పైనే లూటీ చేశారంటూ ట్వీట్ చేశారు. ఇక తాజాగా మరో మళ్ళీ కోడెలపై సోషల్ మీడియా వేదికగా దాడికి దిగారు విజయసాయి రెడ్డి.

  షాకింగ్ నిజాలు చెప్పి చంద్రబాబుకు నిద్ర లేకుండా చేసిన సీఎం జగన్ .. బాబు నిఘా షురూనా ?

  ‘కె' ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలు అవుతోంది.. అక్రమ సంపాదనకు కుటుంబాన్ని ప్రోత్సహించిన కోడెల అన్న విజయసాయి

  ‘కె' ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలు అవుతోంది.. అక్రమ సంపాదనకు కుటుంబాన్ని ప్రోత్సహించిన కోడెల అన్న విజయసాయి

  టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై మరోసారి విరుచుకుపడిన విజయసాయిరెడ్డి కోడెల ‘కె' ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలు అవుతోందని బాధితులు ఫిర్యాదులు చేస్తూ ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు . తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కోడెల కుమారుడు, కుమార్తె చిరు వ్యాపారులను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. అంతేకాదు ఇదంతా కోడెలకు తెలుసని విజయసాయి ఆరోపణ . కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించిన కోడెల శివప్రసాదరావుపై ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని విజయసై డిమాండ్ చేశారు.

   కొత్త ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అన్న కోడెల ... ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ట్వీట్

  కొత్త ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అన్న కోడెల ... ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ట్వీట్

  ఇక కోడెల శివప్రసాద్ అధికార పార్టీ కావాలనే తమపై తప్పుడు కేసులను పెట్టిస్తుందని , కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాము అవినీతి చేసినట్టుకానీ భూ కబ్జాలు చేసినట్టు కానే ఒక్క ఆధారం చూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. విజయసాయి సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని కోడెల మాట్లాడారు. విజయసాయి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. ఇక తాజాగా కూడా విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘కోడెల K ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలవుతోంది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కొడుకు,కూతురు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని బతికే వారిని దోచుకోవడంపై పూర్తి దర్యాప్తు జరుగుతుంది. కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించిన మాజీ స్పీకర్ పై ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి' అని ట్వీట్ చేశారు.

  అజ్ఞాతంలో కోడెల ఫ్యామిలీ .. ఏం జరగనుందో అన్న ఆసక్తి

  అజ్ఞాతంలో కోడెల ఫ్యామిలీ .. ఏం జరగనుందో అన్న ఆసక్తి

  ఇప్పటికే కోడెల కుమారుడు, కోడెల కుమార్తె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక వారి మీద ఫిర్యాదులు మాత్రం ఆగటం లేదు. ఇక ఈ నేపధ్యంలో ‘కె' ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలు అవుతోందని విజయ సాయి చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశం అవుతున్నాయి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The YSRCP MP V Vijayasai Reddy commented that the TDP leader Kodela Siva Prasada Rao had once again targeted by the YCP MP Vijayasai reddy . he spoke against the 'K' tax, are being complained of by the victims. Kodela's son and daughter were stolen the business men with the support of father. The matter is being investigated. And that's all the allegations. Vijayasai demanded that the case be registered under the Abetment section of Kodela Shivprasadasrao, which encouraged family robbery in the society .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more