Chandrababu : కుప్పంలో లక్ష మెజారిటీపై చంద్రబాబు టార్గెట్-తాజా వ్యూహాలివే..!
ఏపీలో విపక్ష నేతగా ఉన్న కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుకు ఈసారి వైసీపీ ప్రభుత్వ హయాంలో గట్టి సవాల్ ఎదురవుతోంది. అదీ రాష్ట్రవ్యాప్తంగానే కాదు ఆయన వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుప్పం నియోజకవర్గంలో కూడా. కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో పలు ప్రయత్నాలు చేసిన సీఎం వైఎస్ జగన్.. ఈ మధ్య సైలెంట్ అయిపోయారు. అలాగే వైసీపీ నేతలు కూడా కుప్పం గెలుపుపై మాట్లాడటం దాదాపు తగ్గించేశారు.
కుప్పంలో 2019 ఎన్నికల తర్వాత వైసీపీ సాధించిన వరుస విజయాలతో.. 2024 ఎన్నికల్లోనూ టీడీపీ వర్సెస్ వైసీపీ పోరు గట్టిగానే ఉంటుందని అంతా భావిస్తూ వచ్చారు. కానీ తాజాగా ఆ పరిస్ధితి లేదని తేలిపోయింది. దీంతో కుప్పంలో గెలుపు గురించి వైసీపీ పట్టించుకోవడం మానేసినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ కూడా తమ కంచుకోట కుప్పంలో ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది.

తనను వరుసగా ఏడుసార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గంపై చంద్రబాబు ఈసారి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.ఈసారి ఎన్నికల్లో కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా టీడీపీ నేతలతో ఆయన కమిటీలు ఏర్పాటు చేశారు.సమన్వయ కమిటీ తో పాటు పలు కమిటీల్ని ఇందుకోసం ఏర్పాటు చేశారు. 34 మందితో ఏర్పాటైన సమన్వయ కమిటీ అన్ని కమిటీల్ని సమన్వయం చేస్తుంది. ఈ సమన్వయ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇంచార్జి మునిరత్నం, కన్వీనర్ గా ఆర్.చంద్రశేఖర్ ను నియమించారు. అలాగే సభ్యులుగా మరో 31 మందిని నియమించారు.
కుప్పంలో వైసీపీ విసిరిన సవాల్ తో ఇప్పటికే అప్రమత్తమైన చంద్రబాబు వరుసగా అక్కడ పర్యటనలు చేశారు. వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న ఎమ్మెల్సీ కేఎస్ భరత్ తనకు ఏమాత్రం పోటీయే కాదని భావిస్తున్న చంద్రబాబు.. గతంలో ఆయన తండ్రి చంద్రమౌళిపై సాధించిన మెజారిటీకి ఈసారి మూడురెట్ల మెజారిటీ సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందుకోసం సమన్వయ కమిటీతో పాటు పలు కమిటీల్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్ధితుల్ని అంచనా వేస్తూ మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications