వామ్మో.. వీరేమి స్నేహితులురా.. అయ్యా.. మలద్వారంలో ప్రెజర్ పైప్ పెట్టి గాలి.. కోమాలోకి
బర్త్ డే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వేడుకను కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేస్తున్నారు. మరికొందరు కేకు పూసి నానా హంగామా చేస్తున్నారు. ఇంకొందరు బర్త్ డే బాంబ్స్ పేరుతో దాడి చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు.. వీడియోలు చాలా సందర్భాల్లో బయటకు వచ్చాయి. కానీ వారిలో మార్పు రాలేదు. ఇంకా ఇంతకన్నా నీచానికి దిగజారుగుతున్నారు. అవును ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటన తెలిసి ముక్కున వేలేసుకోవాల్సిందే.. ఇంతకీ ఏం జరిగిందంటే..

చీమకుర్తిలో బర్త్ డే
చీమకుర్తిలో ఓ యువకుడి బర్త్ డే జరిగింది. అతను గ్రానైట్ క్వారీలో పనిచేస్తాడు. ఇంకేముంది అక్కడ బర్త్ డే సెలబ్రేడ్ చేసుకున్నాడు. తన స్నేహితులను అక్కడికి పిలిచారు. ఇంకేముంది వారు మద్యం సేవించారో ఏమో తెలియదు గానీ.. వింత చేష్టలు చేశారు. అవును బర్త్ డే బాయ్ ప్రాణాపాయం మీదకి తెచ్చారు. ఆ ఘటనతో ఒక్కసారిగా మిగతా వారు షాక్ తిన్నారు. అవును ఎందుకంటే ఆ బర్త్ డే బాయ్ ప్రాణం మీదకు తెచ్చింది ఆ ఘటన.

ప్రెజర్ పంప్‌తో గాలి
క్వారీలో వాడే ప్రెజర్ పంప్‌ను యువకుడి మలద్వారం వద్ద పెట్టారు. ఆ బర్త్ డే బాయ్‌కి గాలి కొట్టడంతో కడుపులో పేగులు పగిలాయి. వెంటనే ఆ యువకుడు కోమాలోకి వెళ్లిపోయాడు. బ్రతుకు జీవుడా అంటూ హుటహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏమాత్రం ఆలస్యం కాకపోవడంతో.. ఆ యువకుడికి సకాలంలో చికిత్స అందింది. దీంతో అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. కానీ అతను/ అతని ఫ్రెండ్స్ గుండె గుబెల్ మని ఉంటుంది. ప్రమాదం జరగనందున ఊపిరి పీల్చుకున్నారు. కానీ జరగరానిది జరిగితే మాత్రం అంతే సంగతులు.

ప్రాణాల మీదకు తెచ్చి
పుట్టిన రోజు పేరుతో పైత్యం ఏంటో మరీ.. చక్కగా చదవి.. ఉద్యోగం చేసుకోవాల్సింది పోయి.. విచిత్రంగా ప్రవర్తించి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇదీ సరికాదు అని అందరూ చెబుతున్న వినిపించుకోవడం లేదు. తమ పైత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇందుకు చీమకుర్తి ఘటన సజీవ సాక్ష్యం.. ఇదీ వెలుగులోకి వచ్చినందున ప్రపంచానికి తెలిసింది. అలా తెలియని ఘటనలు ఎన్నొ ఉన్నాయి.
అవును చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుని ఉంటారు. మరికొందరు బర్త్ డే బాంబ్స్ తిని ఉంటారు. అప్పటికీ సరదాగా సాగిన.. ఆ నొప్పిన భరించని వారు ఎందరో ఉన్నారు. కొందరు సీరియస్ అయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక లెవల్ వరకు అయితే.. ఓకే.. అదీ దాటితే అంతే. సో బర్త్ డే పేరుతో చిత్ర, విచిత్రాలు చేయడం ఇకనైనా యువత మానాల్సి ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications