'అర్నాబ్' ఉగ్రరూపం.. ప్రయాణికులకు ఎయిర్ ఇండియా విజ్ఞప్తి

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నాబ్' తీవ్ర తుఫాను ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన కొద్ది గంటలుగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుఫాను.. బుధవారం ఉదయానికి బాపట్ల - విశాఖపట్నం మధ్య ఉన్న యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్నిచోట్ల గాలుల వేగం 140 కిలోమీటర్ల వరకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో గాలివాన తీవ్రరూపం దాల్చనుంది.

విమాన ప్రయాణాలకు విఘాతం..

తుఫాను తీవ్రత, ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసింది. అక్టోబర్ 27న విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల నుంచి నడిచే విమాన సర్వీసులపై 'అర్నాబ్' తుఫాను ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు, బలమైన గాలుల వల్ల రోడ్డు ప్రయాణాలు కూడా నెమ్మదించే అవకాశమున్నందున ప్రయాణికులు విమానాశ్రయానికి కాస్త ముందే బయలుదేరాలని సూచించింది. విమానాల రాకపోకల సమయాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫ్లైట్ స్టేటస్‌ను సరిచూసుకోవాలని ప్రయాణికులను కోరింది.

Air India Issues Advisory For Visakhapatnam And Vijayawada Flights Due To Severe Cyclone Arnab Threat
 మున్సిపల్ ఎన్నికలపై ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్, కీలక నిర్ణయం..!!
మున్సిపల్ ఎన్నికలపై ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్, కీలక నిర్ణయం..!!

16 జిల్లాల్లో హై అలర్ట్..

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలోని 16 జిల్లాలు, వేల సంఖ్యలో గ్రామాలు ఈ తుఫాను పరిధిలో ఉండే అవకాశం ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) యంత్రాంగాన్ని సంపూర్ణంగా సమాయత్తం చేశాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కోస్తా తీరప్రాంతాల్లో ఏకంగా 1,763 తుఫాను పునరావాస కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. రెస్క్యూ, సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బలగాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మోహరించాయి.

Cyclone Arnab: తుపాను ఇప్పుడెక్కడుంది?.. దిశ మారి ఏ జిల్లాకు ప్రమాదం?
Cyclone Arnab: తుపాను ఇప్పుడెక్కడుంది?.. దిశ మారి ఏ జిల్లాకు ప్రమాదం?

కంట్రోల్ రూమ్‌లు.. అధికారుల నిరంతర పర్యవేక్షణ

జిల్లా, మండల స్థాయిల్లో సుమారు 2,900కి పైగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి విపత్తు పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షిస్తున్నారు. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. తుఫాను ప్రభావం పూర్తయ్యే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+